భార్యను వేధిస్తున్నాడని, తండ్రిని కదులుతున్న రైల్లో నుండి తోసేసిన కొడుకు
పశ్చిమగోదావరి జిల్లాలో మిస్సింగ్ కేసును గోపాలపురం పోలీసులు ఛేదించారు. 4 నెలల క్రితం సత్యనారాయణ అనే వ్యక్తి అదృశ్యమైయాడని పీఎస్ లో కేసు నమోదైంది.
పశ్చిమ గోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో మిస్సింగ్ కేసును గోపాలపురం పోలీసులు ఛేదించారు. 4 నెలల క్రితం సత్యనారాయణ అనే వ్యక్తి అదృశ్యమైయాడని పీఎస్ లో కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు నెలలైన సత్యనారాయణ ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు మరింత విచారణ చేపట్టారు. ఎంతకీ సత్యనారాయణ ఆచూకీ లభించలేదు.
అనుమానం తో పోలీసులు సత్యనారాయణ భార్యను విచారించారు. అనంతరం సత్యనారాయణ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విచారణ లో సత్యనారాయణ తల్లి సూచనల మేరకు కొడుకు ప్రవర్తన పై అనుమానం వచ్చిన పోలీసులు కేసు ను మరో కోణం లో దర్యాప్తు ప్రారంభించారు.

దీనితో సత్యనారాయణ కొడుకు పై అనుమానం వచ్చిన పోలీసులు నిఘా వేసి సత్యనారాయణ మిస్సింగ్ పై కొన్ని అనుమానాలు ఉండటము తో తమదైన స్టైల్లో విచారణ ముగించారు. ఈ విచారణ లో తన భార్యను వేధిస్తున్నాడనే కోపంతో కొడుకే చంపినట్టు పోలీసులు నిర్ధారించారు.
తండ్రిని నమ్మించి గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న తండ్రికి మెరుగైన వైద్యం చేయిస్తానని మధ్యప్రదేశ్ తీసుకెళ్లి.. తండ్రిని కదులుతున్న రైలు నుంచి తోసేసినట్టు విచారణలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications