రూ. 500 కోసం భార్యతో గొడవ, ఆత్మహత్య: పావురాన్ని కాపాడపోయి..
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి - కాప్రా పరిధిలోని సాయిబాబానగర్‌కు చెందిన మజీద్(28) భార్య నాలుగురు పిల్లలు ఉన్నారు. పెయింటర్ అయిన మజీద్ రోజు పనిముగించుకొని మద్యం సేవించేవాడు. ఇటీవల మద్యం మత్తులో పడి మజీద్ పనికి వెళ్లడం మానేశాడు.
కాగా ఆదివారం తనకు రూ.500 కావాలని భార్యతో గొడవపడ్డాడు. దీంతో భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఆపై తీవ్రమనస్తాపానికి గురైన మజీద్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఎస్సై అంజయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పావురాన్ని కాపాడబోయి మృతి
విద్యుత్ తీగలకు చిక్కుకున్న ఓ పావురాన్ని కాపడబోయి విద్యుత్ షాక్ గురై ఓ యువకుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన సుబ్బారెడ్డి కొడుకు పి. గోవర్ధన్‌రెడ్డి(24) ఈ ఏడాది బీటెక్ పూర్తి చేసుకుని, యూఎస్‌లో ఎంస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పాస్‌పోర్టు పనిపై వారం రోజుల క్రితం నగరానికి వచ్చి కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని బాలాజీనగర్ కాలనీలో నివాసముంటున్న తన బంధువు బొంతు బస్వంత్‌రెడ్డి వద్ద ఉంటున్నాడు.
కాగా, ఆదివారం గది బాల్కానిలో ఉన్న గోవర్ధన్‌రెడ్డి, ఇంటి ముందు ఉన్న విద్యుత్ తీగలకు ఓ పావురం చిక్కుకుని ఉండడం గమనించి కాపాడేందుకు యత్నించాడు. ఇంట్లో బూజు తీసే ఇనుప కర్రకు చిన్న కత్తిని కట్టి పావురం కాళ్లకు చుట్టి ఉన్న దారాన్ని కోయడానికి యత్నించాడు.
ఈ క్రమంలో కత్తి కట్టిన కర్ర ఇనుము కావడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. గదిలో ఉన్న వారు వచ్చి చూసే సరికే మృతిచెండాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం కావడంతో చుట్టు పక్కల వారు వచ్చి గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని కిందికి దించి కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. కూకట్‌పల్లి ఎస్సై శేఖర్ వివరాలు సేకరించి, మృతదేహాన్ని గాంధి ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications