అక్రమ సంబంధం: ప్రేయసిని చంపి వ్యక్తి ఆత్మహత్య

man kills lover and commits suicide
నెల్లూరు: వైవాహికేతర సంబంధం ఇద్దరి జీవితాలను బలి తీసుకుంది. తన ఆస్తి అంతా కరిగిపోవడంతో ప్రియురాలు తనను దూరం చేస్తుందనే బాధతో ఓ ప్రియుడు పథకం ప్రకారం ఆమెను హత్య చేసి సూసైడ్‌నోట్ రాసి పెట్టి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

పొదలకూరులోని శ్రీహరిచేను కాలనీలో నివాసం ఉంటున్న అంకమ్మ (30) అనే వివాహితతో అగచాట్లపురం కాలనీకి చెందిన ఎస్‌కె బాబు(34) గత నాలుగేళ్లుగా వివాహేతర కొనసాగిస్తున్నాడు. అంకమ్మ కుటుంబానికి తరచూ బాబు ఆర్థిక సహాయం చేసేవాడు. ఈ నేపధ్యంలో రెండు కుటుంబాలు అన్యోన్యంగా ఉండేవి. ఒకరింటికి మరొకరు వచ్చి పోతూ ఉండేవారు. ఈ క్రమంలో బాబు వద్ద ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోయింది.

దీంతో తన వద్దకు రావద్దని అంకమ్మ బాబుతో గట్టిగా చెప్పింది. తన వద్ద డబ్బు అంతా అయిపోయాక తనను రానివ్వకుండా తెగతెంపులు చేసుకుంటూ ఉందని భావించిన బాబు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఒక పథకం ప్రకారం చివరిసారిగా నీతో మాట్లాడుతానని, చెప్పి కాలనీకి సమీపంలోని ఓ నిర్జన ప్రదేశానికి రప్పించాడు. అక్కడ కొంత సేపు వారు మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత బాబు తన వెంట తెచ్చుకున్న సైనేడ్‌ను బలవంతంగా అంకమ్మ నోట్లో పోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే నురగలు కక్కుకుని మృతి చెందింది. ఆ తరువాత ఇంటికి చేరుకున్న బాబు హత్య కేసులో తాను దొరికిపోతానని భయపడి తానూ సైనేడు మింగి బలవన్మరణం చెందాడు. సైనేడు మింగడానికి ముందు సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నాడు. తనను నమ్మంచి నా ఆస్తిని అంతా కాజేసిందని, అంతా పొగొట్టుకున్నాక రావద్దనడంతో బాధతో ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నోట్‌లో వివరించాడు.

హతురాలికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. మృతునికి 11 ఏళ్ల కూతురు, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కాగా తన భార్యను నిందితుడు బాబు ఓ పథకం ప్రకారం హత్య చేశాడని హతురాలి భర్త పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+