గుంటూరు జిల్లాలో దారుణం: పెద్దమ్మను అతి కిరాతంగా హత్య చేశాడు
అమరావతి: ఆస్తి కోసం పెద్దమ్మను గొంతు నులిమి హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గొలుసుపాడులో చోటు చేసుకుంది. బక్రీద్ రోజున జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం షేక్ బాషా అనే వ్యక్తి తొలుత జాన్‌బీని పెళ్లి చేసుకోగా వారికి పిల్లలు కలగలేదు. దీంతో బాషా జాన్‌బీ చెల్లెలు మీరాబీని విహహం చేసుకున్నాడు. వీరికి నాగుల్ మీరాషా సంతానం. ఈ మధ్య కాలంలో నాగుల్ మీరాషా మద్యానికి అలవాటై ఆస్తికోసం పెద్దమ్మ జాన్‌బీని కొంతకాలంగా వేధిస్తున్నాడు.

అందుకు ఆమె అంగీకరించకపోవడంతో బక్రీద్ రోజున మద్యం సేవించి ఆమెను హత్య చేశాడు. శవాన్ని ఇంట్లోనే ఉంచి గ్యాస్ లీకేజ్ అవడం వల్ల చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టు ప్రక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
యువతిని హత్య చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు
గుంటూరులోని ఏటి అగ్రహారం మూడో లైన్‌లో మాధవి అనే యువతిని ఓ యువకుడు హత్య చేశాడు. అనంతరం ఆ యువకుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు ఆ యువకుడిని జీజీహెచ్‌కు తరలించారు.
వివాహేతర సంబంధమే దీనికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిమజ్జనంలో అపశ్రుతి: ఆర్మీ ఉద్యోగి మృతి
శ్రీకాకుళం జిల్లాలోగణేష్ నిమజ్జంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని పాతపట్నంలో నిమజ్జనానికి వినాయక విగ్రహాలను మహేంద్రతనయ నది వద్దకు తీసుకొచ్చారు. నిమజ్జన సమయంలో ప్రమాదశాత్తు నదిలో పడి ఆర్మీ ఉద్యోగి ఒకరు మృతిచెందాడు. దీంతో అక్కడ విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications