భార్యనుఇటుకలతో కొట్టి చంపిన భర్త, టీచర్‌పై బహిష్కరణ

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యను ఇటుకలతో ఓవ్యక్తి ఇటుకలతో కొట్టి చంపాడు. అత్తను కూడా అతను కొట్టాడు. అయితే ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జిల్లాలోని సంజీవ్‌గాంధీనగర్‌లో ఈ ఘటన జరిగింది. విక్టర్‌ అనే వ్యక్తి తాగుడుకు బానిస కావడంతో అతడి భార్య నిర్మలాదేవి పుట్టింటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అత్తారింటికి వచ్చిన విక్టర్‌ భార్యతో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది.

మద్యం మత్తులో ఉన్న విక్టర్‌ ఇటుకపెల్లలు తీసుకొని భార్య తలపై గట్టిగా కొట్టాడు. ఆపడానికి వచ్చిన అత్త వేదమణిని కూడా ఇటుకలతో కొట్టాడు. ఈ ఘటనలో నిర్మలాదేవి మృతిచెందగా, వేదమణి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. స్థానికులు వేదమణిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.

 man kills wife beating with bricks in Nellore didtrict

నెల్లూరు జిల్లాలో విద్యార్థులను చిత్రహింసలు పెడుతున్న ఓ ఉపాధ్యాయుడిని గ్రామస్థులు బహిష్కరించారు. జిల్లాలోని కావలి మండలం, తుమ్మలపెంట, పట్టపుపాలెం మధ్య గల ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌, విద్యార్థులను అనవసరంగా కొట్టేవాడని, అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా ప్రతిఒక్కరికీ నరకం చూపించే వాడని తెలిసింది.

ఆ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆ ఊరి పెద్దలు దారాయి (పంచాయితీ)ద్వారా ఆ ఉపాధ్యాయుడిని తమ గ్రామంలోకి రాకుండా బహిష్కరించాలని నిర్ణయించారు. అనుకున్న ప్రకారమే ఈ రోజు ఉదయం స్కూల్‌కు వచ్చిన శ్రీనివాస్‌ను గ్రామస్థులు బహిష్కరించినట్లు తెలిసింది.

నెల్లూరు జిల్లాలోని వివిధ ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను ఆత్మకూరులో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి లక్ష రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+