జగన్ పార్టీ రౌడీల పనే: మందకృష్ణ, చీలిపోయాం: గాదె

హైదరాబాద్‌ను యూటి చేస్తే ఇక యుద్ధమేనన్నారు. హైదరాబాద్‌ను యూటి కాకుండా చూసుకోవడం, తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయడానికి తెలంగాణవాదులందరి కర్తవ్యంగా ఉద్యమాలను కొనసాగించాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఎమ్మార్పీఎస్ సీమాంధ్రలో మద్దతు కోసం తనవంతు బాధ్యత నిర్వర్తిస్తుందన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చూసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
సమైక్యాంధ్ర ఉండాలని కోరుకుంటున్న వారి అంతిమ లక్ష్యం హైదరాబాద్‌ను యూటి చేయడమేనని విమర్శించారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల గల సీమాంద్రుల అక్రమాస్తులను కాపాడుకోవడానికే యూటి అంటున్నారని తెలిపారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఇవ్వడమంటే తల లేని మొండాన్ని, గుండె లేని మనిషిని అప్పగించినట్లేనన్నారు. యూటి చేస్తే యుద్ధమేననే నినాదంతో ఈనెల 21న లక్ష మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ ఓయూ అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
ఏకాభిప్రాయంపై గాదె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం లభించిందన్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి గుంటూరులో అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ రెండుగా చీలిందన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తొలి నుంచి సమైక్యమంటున్నారని, మజ్లిస్, సిపిఎం సమైక్యవాదాన్ని బలంగా వినిపించాయన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications