కేసీఆర్ వ్యాఖ్య దుమారం: 'రాజయ్యను తొలగించే కుట్ర'
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుండి తొలగించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా చేర్యాల, కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆయన మాట్లాడారు. వేలాదిమంది సమక్షంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పట్టుకొని హామీలిచ్చేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని అనడం దారుణమన్నారు.
ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడంటూ.. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ఉద్దేశించి ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. కేసీఆర్ అహంకారంతో దళితుడైన ఉప ముఖ్యమంత్రిని వందల మంది సమక్షంలో చులకనగా మాట్లాడారంటూ దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితుల ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీశారని నిప్పులు చెరిగాయి.
మంగళవారం వరంగల్‌లో కాళోజీ శత జయంతి ఉత్సవంలో పాల్గొన్న కేసీఆర్.. రాజయ్యను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మాదిగ సామాజికవర్గానికి చెందిన రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించే కుట్రతోనే కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించారని మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు.

కేసీఆర్ అహంకారపూరితంగానే అవమానకరంగా రాజయ్యపట్ల దురుసు భాష వాడారని, ఆయన రాజయ్యకు, దళిత జాతికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ది దొర పోకడ అని మందకృష్ణ ఆరోపించారు. అగ్రకుల దురంహకారంతోనే నిండుసభలో దళితుడైన రాజయ్యను ఉప ముఖ్యమంత్రి అనేదీ చూడకుండా హెచ్చరించారన్నారు. కేసీఆర్ పాలన రాజరికాన్ని తలపింపచేస్తోందన్నారు.
గోల్కొండకోటలో జెండా ఎగురవేసిన తర్వాత కేసీఆర్‌లో రాజరిక పోకడ మరింత పెరిగిందని, రాజరిక పాలనలో అంతా రాజుదే పెత్తనమని, మంత్రులు ఉత్సవ విగ్రహాలుగానే ఉండేవారని, కేసీఆర్ పాలన అచ్చం అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని, అందులోభాగంగానే ఓ డిప్యూటీ సీఎం ఔట్ పేరిట పత్రికల్లో వార్తలు రాయించారన్నారు.
ఆ వార్తలను సీఎం సహా మంత్రులు, ఆ పార్టీ నేతలు ఖండించకపోవడం ఈ కుట్రను బలపరుస్తోందన్నారు. జట్సన్ అనే వ్యక్తి కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ దురహంకారంతో మాట్లాడుతున్నారని మాలమహానాడు ఆరోపించింది. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని దళిత సంఘాలు హెచ్చరించాయి.
కేసీఆర్ దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి జట్సన్ డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని ఆయన కమిషన్‌ను కోరారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications