మంగళగిరిలో ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా: ఇంకొద్ది రోజుల్లో గుడ్ న్యూస్
రాజధాని అమరావతి పరిధిలో విజయవాడ సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వేస్టేషన్ కు మహర్దశ పట్టింది. అత్యాధునికంగా రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అమృత్ భారత్ స్టేషన్లల్లో భాగంగా ఇది పునర్నిర్మితమౌతోంది. అత్యాధునిక వసతులు సమకూరుతున్నాయి. దీని పునర్నిర్మాణ పనులు దాదాపుగా 80 శాతం వరకు పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాది ఈ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
అదే సమయంలో అమరావతి పరిధిలోనే మరో రైల్వే స్టేషన్ తుది రూపాన్ని సంతరించుకుంటోంది. అదే మంగళగిరి. ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఎయిర్ పోర్టుల తరహాలో ఓ కాంప్రహెన్సివ్ ట్రావెల్ హబ్ గా రూపుదిద్దుకుంటోంది. అత్యాధునిక సౌకర్యాలు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, రియర్ సైడ్ బిల్డింగ్, వీఐపీ లాంజ్ ఇప్పటికే రెడీ అయ్యాయి కూడా. ప్లాట్‌ఫాం సర్ఫేసింగ్, దివ్యాంగుల సౌకర్యాలు, ఫెకేడ్ పనులు పురోగతిలో ఉన్నాయి.

ప్రయాణికులకు ఆధునిక, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. అమృత్ భారత్ కింద ఎంపిక చేసిన స్టేషన్లను డెవలప్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, ఆదోని, అనంతపురం, చీరాల, చిత్తూరు, కడప,ధర్మవరం, గుడివాడ, గుత్తి, గుంటూరు, హిందూపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస జంక్షన్, కుప్పం, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, రాజంపేట, రేణిగుంట వంటివి ఉన్నాయి.
రాయనపాడు స్టేషన్ కూడా ఇందులో భాగమే. ప్లాట్ ఫామ్ ల నిర్మాణం, వెయిటింగ్ హాళ్లు, టికెట్లు కౌంటర్లు, ప్లాట్ ఫామ్ లపై షెడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. రైల్వే స్టేషన్ ఆధునీకరించిన వసతులతో సరికొత్తగా అందుబాటులోకి రానుంది. కొత్త ముఖద్వారం, విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, సౌకర్యవంతమైన వెయిటింగ్ హాల్, లిఫ్టులు, ఆధునిక టాయిలెట్లు, మెరుగుపరచిన ప్లాట్‌ఫారమ్ ఉపరితలం వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత మరిన్ని రైళ్లు ఆగేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా- విజయవాడ రైల్వేస్టేషన్ పై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడలో నిత్యం వందకు పైగా రైళ్లు ఆగుతుంటాయి. ప్రయాణికుల తాకిడి అధికం. దీనికి ప్రత్యామ్నాయంగా రాయనపాడు స్టేషన్ ను అభివృద్ధి చేయడం వల్ల మరికొన్ని రైళ్లకు ఇక్కడ హాల్ట్ సౌకర్యం కల్పించడానికి వీలవుతుంది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications