మమ్మల్నీ జీవించనివ్వండి: బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహం (పిక్చర్స్)
విశాఖ: హిందూపురం టిడిపి ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు, మహిళలపై దాడులను ఖండిస్తూ పీవోడబ్ల్యూ సోమవారం నాడు విశాఖలో ఆందోళనకు దిగింది.
మేం స్త్రీలమని, మనుషులమని, మమ్మల్నీ జీవించనివ్వాలని, జీవించే హక్కుకై పోరాడుదామని ప్లకార్డులు ప్రదర్శించారు.
బాలకృష్ణ వ్యాఖ్యలను వారు ఖండించారు. అలాగే తెలంగాణలో వీణవంక సామూహిక అత్యాచార ఘటన పట్ల తెలంగాణ ప్రభుత్వం వైఖరిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఏపీలో ఇంద్రాణి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాలకృష్ణ
ఓ ఆడియో ఫంక్షన్‌లో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిక్కుల్లో పడ్డారనే చెప్పవచ్చు. మహిళలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా సోమవారం మండిపడ్డారు. అనంతరం బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు.

పీవోడబ్ల్యూ
హిందూపురం టిడిపి ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు, మహిళలపై దాడులను ఖండిస్తూ పీవోడబ్ల్యూ సోమవారం నాడు విశాఖలో ఆందోళనకు దిగింది.

పీవోడబ్ల్యూ
మేం స్త్రీలమని, మనుషులమని, మమ్మల్నీ జీవించనివ్వాలని, జీవించే హక్కుకై పోరాడుదామని ప్లకార్డులు ప్రదర్శించారు.

పీవోడబ్ల్యూ
బాలకృష్ణ వ్యాఖ్యలను వారు ఖండించారు. అలాగే తెలంగాణలో వీణవంక సామూహిక అత్యాచార ఘటన పట్ల తెలంగాణ ప్రభుత్వం వైఖరిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఏపీలో ఇంద్రాణి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Click it and Unblock the Notifications