తనూజ కేసులో స్నేహితుడే కీలకం?: మృతిలో 'కొత్త కోణం'పై ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక తనూజ కేసులో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనలో బాలిక స్నేహితుడి పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

విశాఖ అమ్మాయి మృతి, ఆ రోజేం జరిగింది: వీడని చిక్కముడి

సదరు స్నేహితుడికి వరుసకు మామ అయ్యే వ్యక్తి పైన గతంలో రౌడీషీట్ ఉంది. అతని ప్రోత్సాహంతోనే ఆ స్నేహితుడు తనూజను రప్పించి ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Many doubts in Student Tanuja suspicious death

వీరిద్దరితో పాటు మరో వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తనూజ స్నేహితుడే కీలకంగా మారాడు. బాలిక పైన లైంగిక దాడి జరిగిందా లేదా అనేది పోస్టుమార్టం నివేదికలో తేలనుంది.

తనూజ మృతిపై దర్యాఫ్తు చేయాలి: మహిళా సంఘాలు

తనూజ మృతి కేసును త్వరితగతిన దర్యాఫ్తు చేయాలని మహిళా సంఘాలు మంగళవారం నాడు డిమాండ్ చేశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆందోళనలో మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

విశాఖ అమ్మాయి మృతిపై డౌట్స్: ప్రేమ వ్యవహారమా, ఏం జరిగింది?

ఇటీవల మహిళల పైన అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. తనూజ కేసును నీరు గార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించాలని, బాలిక ఆత్మహత్య చేసుకుందనే కొత్త వాదనను పోలీసులు తెరపైకి తీసుకు వస్తున్నారన్నారు. ఇది సరికాదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many doubts in Student Tanuja suspicious death.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి