నల్లమలలోమరో మావోయిస్టుల డంప్ లభ్యం
కర్నూలు జిల్లా: నల్లమలలో మరో మావోయిస్టుల డంప్ లభ్యమైంది. కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసులు మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో నల్లమలలో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల సందర్భంగా నాగలూటి వీరభద్రాలయానికి, చెంచుగూడేనికి మధ్యలో భూమిలో 4 అడుగుల లోతున పాతిపెట్టిన ప్లాస్టిక్ డ్రమ్మును గుర్తించారు. అందులో లైవ్ గ్రనేడ్, ఒక వైర్‌లెస్ సెట్, 40 జిలెటిన్ స్టిక్స్, 35కి పైగా గ్రనేడ్స్‌తో పాటు వాటి తయారీకి ఉపయోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. 2004 కు ముందు నల్లమలలో మావోయిస్టుల ఉనికి చాలా ఎక్కువగా ఉండేదన్న సంగతి తెలిసిందే.
అయితే నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన మరిన్ని డంప్‌లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలో, గుంటూరు జిల్లాలో రేమిడిచర్ల అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న డంప్ లు చిన్నవే అయినప్పటికి దట్టమైన అటవీ ప్రాంతంలో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు, ఇతరత్రా సామగ్రిని దాచి ఉంటారనే సందేహాలు వ్యక్తవౌతున్నాయి.

రాష్ట్ర విభజన తరువాత నల్లమల అటవీ భూములను అభివృద్ధిపరంగా వినియోగంలోకి తీసుకురావాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే రూటు డిజైన్ కూడా సిద్దం చేస్తున్నట్లు సమాచారం. దీంతో నల్లమల ప్రాంతంలోకి ఇక మావోయిస్టులు పున:ప్రవేశం చేసే వీలులేకుండా చేసేందుకు పోలీసు యంత్రాంగం కూంబింగ్‌ను ముమ్మరం చేసింది.
దీనికితోడు కొన్ని బహుళజాతి కంపెనీలు ఇప్పటికే నల్లమల అటవీ సంపదపై కన్నేసినట్లు తెలుస్తోంది. రంగురాళ్ల తవ్వకాలు, విదేశీ డాక్యుమెంట్ల చిత్రాల పేరుతో అటవీ ప్రాంతంలో పరిశోధనలు జరుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్నిచోట్ల వజ్రాలు, నిధి నిక్షేపాల కోసం కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు ఫ్యాక్షన్ ప్రాంతాలకు రవాణా చేసే బాంబులు, నాటు తుపాకులను కూడా కొందరు అక్రమార్కులు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వంతో మావోయిస్టుల చర్చలు విఫలమైన అనంతరం 2005 తరువాత పోలీసులు నల్లమల ప్రాంతాన్నిజల్లెడపట్టడంతో వారు ఏఒబి, చత్తీస్‌గఢ్ ప్రాంతాలకు మకాం మార్చారు. అయితే ప్రస్తుతం ఆ రెండు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఎన్‌కౌంటర్లు, నిర్బంధం కొనసాగుతుండటంతో తిరిగి నక్సల్స్ నల్లమలలోని స్థావరాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా తీవ్రతరం చేసి కూంబింగ్‌లు జరుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ నల్లమల అటవీ ప్రాంతం సుమారు 430 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications