వైసీపీ ఓటమిపై మార్గాని భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ పార్టీ సాధించని రితీలో కూటమి ఘన విజయం సాధించింది.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వంటి నేతలు భారీ విజయాలను నమోదు చేశారు.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా వైసీపీ ఓటమిపై ఆ పార్టీ నేత మార్గాని భరత్ స్పందించారు. అభివృద్ధి చేసినా ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలో పొందలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలన్న జగన్ ఆలోచనను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారో అర్థం కావట్లేదన్నారు మార్గాని భరత్. ఏం తప్పులు చేశామో తెలియడం లేదన్నారు. రాజమండ్రి రెల్లి పేటలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా వైసీపీదే ఆధిక్యం అని, అలాంటి ప్రాంతాల్లో కూడా తమ పార్టీ వెనకపడిందని చెప్పారాయన. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించి సేవ చేశానని, సొంత వ్యాపారాలను సైతం పక్కనపెట్టి ప్రజాసేవే పరమావధి అనుకున్నానని, కుటుంబానికి కూడా సమయం కేటాయించకుండా జనం మధ్యే ఉన్నానని.. అయినా ఓడిపోయానని బాధపడ్డారు భరత్.












Click it and Unblock the Notifications