చంద్రబాబు ఆశలు నెరవేరాలంటే - అక్కడే కీలకం..!!
ఏపీలో ఎన్నికల సమరంలో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.రాయలసీమలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. ఈ సారి ఎన్నికల్లోనూ తిరిగి పట్టు కొనసాగించే వ్యూహాలను అమలు చేస్తోంది. ఇటు టీడీపీ తిరిగి తమ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. సీమలో అనంతపురం జిల్లా పైన చంద్రబాబు భారీ ఆశలు పెట్టుకున్నారు. అక్కడే టీడీపీని దెబ్బ తీయాలని జగన్ లక్ష్యం. దీంతో..అక్కడ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం ఆసక్తి కరంగా మారుతున్నాయి.
హోరా హోరీ
అనంతపురం జిల్లాలో ఎన్నికల పోరు హోరా హోరీగా నడుస్తోంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్టుగా సాగుతోంది. జిల్లాలో తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ వంటి కీలకమైన మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఈసారి పోటీలో ఉన్నారు. ఈమెకు పోటీగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సిద్ధమయ్యారు. తిరిగి ఈ ఇద్దరే మరోమారు పోటీపడుతున్నారు. తాడిపత్రిలో జెసి దివాకర్‌రెడ్డి సోదరుడు కుమారుడు జెసి అస్మిత్‌రెడ్డి టిడిపి తరపున బరిలో ఉన్నారు. వైసిపి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రెండోసారి బరిలో ఉన్నారు. మరో కీలకమైన నియోజకవర్గం ఉరవకొండ. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసిపి గాలి వీచినా ఇక్కడ టిడిపి తరపున పయ్యావుల కేశవ్ ఒక్కరే ఈ జిల్లాలో టిడిపి నుంచి గెలుపొందారు.

గెలుపు పై ధీమా
తిరిగి మరోమారు గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పోటీగా వైసిపి నాయకులు వై విశ్వేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఆయన సోదరుడు వై మధుసూదన్‌రెడ్డి వైసిపి నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు టిడిపి తరపున బరిలో ఉన్నారు. వైసిపి తరపున మాజీ ఎమ్మెల్యే మెట్టుగోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డి బిజెపిలో చేరారు. కూటమి తరపున కాలవ శ్రీనివాసులుకు ఆయన మద్దతునిస్తున్నారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో అమిలినేని సురేంద్రబాబు టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకు టికెట్టు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు వైసిపిలో చేరారు. వైసిపి అభ్యర్థి తలారి రంగయ్యకు మద్దతుగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ హోరా హోరీగానే సాగుతోంది.

రెండు పార్టీలకు కీలకం
గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసిపి నుంచి టిడిపిలో చేరి పోటీ చేస్తున్నారు. వైసిపి మాత్రం సిట్టింగు ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డికే టికెట్టును ఇచ్చింది. వైసిపి నుంచి టిడిపిలో చేరిన గుమ్మనూరు జయరాంకు ఇక్కడి స్థానిక నాయకత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. శింగనమలలో టిడిపి తరపున బండారు శ్రావణి పోటీ చేస్తున్నారు. గ్రూపు తగాదాలతో కొంత ఇబ్బందికరంగా ఉంది. వైసిపి అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అనంతపురం అర్బన్‌లో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వైసిపి తరపున మరోమారు బరిలో దిగారు. టిడిపి అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్‌ను బరిలో దింపింది. విజయం కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. అనంతపురం పార్లమెంటు పరిధిలో వైసిపి తరపున శంకర నారాయణ కాగా, టిడిపి నుంచి అంబికా లక్ష్మినారాయణ బరిలో ఉన్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!










Click it and Unblock the Notifications