టెక్కీగా పనిచేసి, పర్వతారోహణకు వెళ్లి చిలీలో మృతి

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకుడు మస్తాన్ బాబు కథ విషాదంతమైంది. అర్జెంటీనాలోని కొండ ప్రాంతాల్లో మస్తాన్ బాబు మృతదేహాన్ని గుర్తించారు. ఆరు వేల అడుగుల ఎత్తున అతని మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం.

మార్చి 25వ తేదీన పర్వతారోహణ చేస్తూ అతను చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణంలో అతను చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా సహాయక బృందాలు ఏరియల్ సర్వే నిర్వహించాయి.

 Mastan babu dead in argentena

మస్తాన్ బాబు మృతదేహాన్ని ఏరియల్ సర్వేలో గుర్తించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంగం గ్రామానికి చెందినవాడు. కుమారుడి జాడ తెలియకపోవడంతో మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది. కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో ఉన్న ఆమె ఆశలు గల్లంతయ్యాయి. దీంతో ఆమె కుమారుడి మరణ వార్త విని కుప్పకూలిపోయింది.

కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకున్న మస్తాన్‌ ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఎంటెక్‌ పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన ఆయన పర్వతారోహణం మీద ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఇప్పటివరకు ఏడు ఖండాల్లో పర్వతాలు ఆధిరోహించి గిన్నిస్‌ బుక్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. చిలీలో మస్తాన్‌ అదృశ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+