ప్రాణహాని, ఆడుకుంటున్నారు: బాబు-కెసిఆర్‌లపై మత్తయ్య సంచలనం
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబానికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

'నీకేం కాదు. నేనున్నానంటూ చంద్రబాబు గతంలో జోలపాడారు. ఇప్పుడు నన్ను అగమ్య గోచర పరిస్థితిలోకి నెట్టారు' అని అన్నారు. చంద్రబాబు అసలు కథెంటో ఈ కేసులో తేలిపోతుందని చెప్పారు.
ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు తెలంగాణ సీఎం కెసిఆర్ ఇద్దరూ తనతో ఆడుకుంటున్నారని వాపోయారు. తాను భయాందోళనతోనే ఢిల్లీకి వెళ్లానని.. తనకు ఏం జరిగినా కెసిఆర్, చంద్రబాబులదే బాధ్యత అని మత్తయ్య పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications