మంత్రి రోజా పై నాగబాబు ఫైర్ : మర్చిపోకు - దిగజారిపోతుంది..!!

మంత్రి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. మెగా బ్రదర్స్ పైన రోజా చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు. పర్యటక శాఖా మంత్రి అంటే పర్యటించటం కాదని.. పర్యాటక శాఖను డెవలప్ చేయటమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏపీ పర్యాటక శాఖ 18వ స్థానంలో ఉందన్నారు. ఈ పాలన ముగిసేలోగా ఏపీ స్థానం 20కి దిగజారిపోతుందన్నారు. తమ సోదరులను..తనను రోజా ఇప్పటి వరకు ఏం మాట్లాడినా స్పందించ లేదని..ఒకటే ఒక కారణమని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని నాగబాబు సూచించారు.

రోజా కు నాగబాబు సూచనలు

పవన్ కల్యాణ్ ను విమర్శించే క్రమంలో మంత్రి రోజా మెగా బ్రదర్స్ ను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేసారు. దీని పైన మెగా బ్రదర్ నాగబాబు ఒక వీడియో పోస్టు చేసారు. అందులో ఏపీలో టూరిజం శాఖ మంత్రిగా రోజాకు కొన్ని సూచనలు చేసారు. దేశంలో పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉందన్నారు.

కేరళ, అస్సాం, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించారు. ఏపీ తరువాతి స్థానాల్లో చత్తీస్ ఘడ్, జార్ఖండ్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఏపీలో పర్యాటక శాఖ పైన ప్రత్యక్షంగా..పరోక్షంగా ఆధారపడి వేల మంది జీవిస్తున్నారని వివరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి జీవితాలు మట్టికొట్టుకు పోయాయని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

రోజా నోటికి మున్సిపాల్టీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదంటూ

రోజా నోటికి మున్సిపాల్టీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదంటూ

ఇప్పటి వరకు అన్నయ్య చిరంజీవి, తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి ఏం మాట్లాడినా స్పందించలేదన్నారు. తన గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదని చెప్పారు. మంత్రి రోజా తమ గురించి ఏం మాట్లాడినా పట్టించుకోక పోవటానికి కారణం ఒక్కటేనని వివరించారు.రోజా నోటికి మున్సిపాల్టీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదన్నారు.

చూస్తా చూస్తా ఎవరూ మున్సిపాల్టీ కుప్పతొట్టిని గెలకరని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలంటూ మంత్రి రోజాపై నాగబాబు ఫైర్ అయ్యారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని, పర్యాటక శాఖను ఎలా అభివవృద్ధి చేయాలో తెలుసుకోవాలని నాగబాబు సూచించారు.

చిరంజీవి పైన విమర్శలతో ఆగ్రహం

చిరంజీవి పైన విమర్శలతో ఆగ్రహం

మంత్రి రోజా తాజాగా చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మెగా బ్రదర్స్ ను సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా ఆరోపించారు. సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారని కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు.

అందుకే రాజకీయాల్లో వీరిని ప్రజలు ఆదరించలేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్..నాగబాబును జనసేన నేతలుగా మంత్రి రోజా టార్గెట్ చేసినా.. చిరంజీవి ప్రస్తావన తేవటం పైన చర్చ సాగుతోంది. తాజాగా.. జబర్ధస్త్ ఫేం గెటప్ శ్రీను కూడా తన ఫేస్ బుక్ ద్వారా చిరంజీవి గురించి మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల పైన అభ్యంతరం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+