చిరంజీవి అసలు టార్గెట్ ఆయనే, పనీ పాట లేదా - బయటకొచ్చిన పూర్తి ప్రసంగం..!!

ఏపీలో ఇప్పుడు చిరంజీవి వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. చిరంజీవి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపైన మంత్రులు వరుసగా విరుచుకు పడుతున్నారు. తమ్ముడు కోసమే చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేసారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో అసలు చిరంజీవి మాట్లాడిన పూర్తి ప్రసంగం వీడియో బయటకు వచ్చింది. అందులో చిరంజీవి ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారో స్పష్టంగా ఉంది.

చిరంజీవి వ్యాఖ్యల వెనుక:చిరంజీవి వాల్తేరు వీరయ్య వేడుకలో చేసిన ప్రసంగంలో సినిమా హీరో చిరంజీవి వాల్తేరు వీరయ్య వేడుకలో సినిమా వాళ్లకు ఎక్కువ పారితోషకాలు ఇస్తున్నారని పార్లమెంట్ లో పెద్దల సభలో మాట్లాడుతున్నారని , వాళ్లకేమీ పనీ పాట లేదా అనిపిస్తోందంటే చిరంజీవి కామెంట్ చేసారు. తాము ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి వస్తుందని చెప్పారు. అంతమందికి కడుపునిండా తిండి దొరుకుందున్నారు. వాళ్ల కుటుంబాలు సుఖంగా ఉంటాయన్నారు. సినిమాలు చేస్తున్నామంటే వ్యాపారం జరుగుతుంది కాబట్టేనని చెప్పుకొచ్చారు. అందుకే తమకు డబ్బులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తున్నారని వివరించారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బు మీద డబ్బు వస్తుంది కాదని చిరంజీవి స్పష్టం చేసారు.

Megastar Chiraneevi full speech in Waltair Veerayya movie Event, comments Against Vijaya Sai Reddy

సినిమా చూసా..రాజకీయాలు చూసా:సినిమా వాళ్లందరికీ ఉపాధి దొరుకుతుందని వివరించారు. అంతే కానీ, అదేదో పెద్ద సమస్యలాగా, దేశంలో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేమీ లేదన్నట్లుగా పార్లమెంట్ లో పెద్దల సభలో కూడా దీని గురించి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, ఉద్యోగ -ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని పేర్కొన్నారు.పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించాలని సూచించారు. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారన్నారు. అంతే కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని ప్రశ్నించారు. తాను రాజకీయాలు చూశానని. .సినిమానీ చూశానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

సాయిరెడ్డి వ్యాఖ్యల ప్రస్తావన:పెద్ద పెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవాలని తప్ప..సినీ తారల పారితోషికాలు తీసుకోవటం తప్పు అంటూ దేవ వ్యాప్తంగా ఎత్తి చూపే ప్రయత్నాలు చేయవద్దని విన్నవించుకుంటున్నానని చిరంజీవి తన ప్రసంగంలో సూచించారు. చిరంజీవి వ్యాఖ్యలు తాజాగా రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి చేసిన ప్రసంగం లక్ష్యంగా చేసినట్లు స్పష్టం అవుతోంది. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో హీరోల రెమ్యునరేషన్ పైన జరిగిన చర్చలో సాయిరెడ్డి హీరోల పారితోషకాల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. సినిమా అంటే హీరో ఒక్కడే కాదని..హీరోలకు సింహ భాగం వెళ్లే విధానం మారాలని సూచించారు. ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడినట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+