కాంగ్రెస్‌కు చిరంజీవి షాక్: రాజకీయాలకు మెగాస్టార్ గుడ్‌బై, ఇక సినిమాలకే

Posted By:
Subscribe to Oneindia Telugu
  Chiranjeevi leave politics soon కాంగ్రెస్‌కు చిరంజీవి షాక్ | Oneindia Telugu

  హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 2018 మార్చి నాటికి చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెబుతారని సమాచారం. రాజకీయాలకు గుడ్‌బై చెబితే పూర్తి సమయాన్ని సినిమాలకే చిరంజీవి కేటాయించే అవకాశం ఉందనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో నెలకొంది.

  సినీ నటుడు చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పిఆర్‌పిని కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి విలీనం చేశారు.

  కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడ పనిచేశారు. అయితే 2014 ఎన్నికలకు ముందుగా తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం 2014 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో తీవ్ర ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీపై చూపింది.

  రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు చిరంజీవి హజరుకావడం అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఇటీవల 150 సినిమాలో నటించిన చిరంజీవి తిరిగి సినిమాలపై తనకు ఏమాత్రం ఆసక్తి తగ్గలేదని చెప్పకనే చెప్పారు. తాజాగా 151 సినిమాలో కూడ చిరంజీవి నటిస్తున్నారు.

  చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై

  చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై

  సినీ నటుడు చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమాలకే పూర్తి సమయాన్ని చిరంజీవి కేటాయించే అవకాశం లేకపోలేదనే వార్తలు కూడ విన్పిస్తున్నాయి. 2018 మార్చి నాటికి చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు , కార్యక్రమాలకు కూడ చిరంజీవి దూరంగా ఉంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే పార్టీ కార్యక్రమాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

  కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదనే...

  కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదనే...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదనే కారణంతోనే చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం కూడ ఉంది. 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. కనీసం డిపాజిట్లు కూడ ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీచేసిన అభ్యర్థులకు దక్కలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించిన చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యేందుకు నిర్ణయం తీసుకొన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

  ఓటేసేందుకే ఢిల్లీకి వెళ్ళిన చిరంజీవి

  ఓటేసేందుకే ఢిల్లీకి వెళ్ళిన చిరంజీవి

  కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటు వస్తున్న చిరంజీవి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రమే ఢిల్లీకి వెళ్ళారు. ఓటు హక్కును వినియోగించుకొని హైద్రాబాద్‌కు చేరుకొన్నారు.నంద్యాల ఉపఎన్నికల్లో కర్నూల్ జిల్లాకు చెందిన నేతలు రఘువీరారెడ్డి , తులసీరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కానీ, చిరంజీవి మాత్రం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఓటింగ్‌ను నిలుపుకొనేందుకే పోటీచేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  సినిమాల్లో బిజీ బిజీగా చిరంజీవి

  సినిమాల్లో బిజీ బిజీగా చిరంజీవి

  సినిమాలో రెండో ఇన్నింగ్స్‌ను 150వ, సినిమాతో చిరంజీవి ప్రారంభించారు. ఈ సినిమా సూపర్‌‌హిట్ అయింది. దీంతో ఇక సినిమాల్లో నటించాలని చిరంజీవి భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 151వ,సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రాజకీయాలకు చిరంజీవి గుడ్‌బై చెబితే సినిమాల్లో ఇక బిజీ అయ్యే అవకాశం ఉందని ఆయన అభిమానులు చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Former Union minister, Tollywood actor Chiranjeevi will leave politics soon. There is a spreading a rumour on Chiranjeeve will leave from politics till 2018 March.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X