• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపిలోకి వ‌ల‌స‌ల వెల్లువ‌..! బాబును ఒదిలించుకుంటున్న తెలుగుత‌మ్ముళ్లు..!!

|

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఏపీ రాజ‌కీయాల్లో వ్యూహాలు, ప్ర‌తివ్యూహామాల‌కు తోడు ఇప్పుడు మైండ్ గేమ్ కూడా మొద‌లైంది. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుండే పార్టీలు నువ్వానేనా అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దానికి తోడు రాజ‌కీయ నేత‌లు కూడా ఏ పార్టీలో కొన‌సాగితే భ‌విష్య‌త్తు ఉంటుంద‌నే అంశంపై అతిగా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకోసం కొంత మంది నేత‌లు త‌మ సిద్దాంతాల‌కు సైతం నీళ్లొదులుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష పార్టీ పై ఆశలు పెట్టుకున్న అదికార టీడిపి నేత‌లు అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరిపోతున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందే అదికార టీడిపి బ‌ల‌హీన‌ప‌డిపోంతుద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

 ఆస‌క్తి రేపుతున్న ఏపి రాజ‌కీయాలు..! గెలుపుపై ధీమా లేని నేత‌లు..!!

ఆస‌క్తి రేపుతున్న ఏపి రాజ‌కీయాలు..! గెలుపుపై ధీమా లేని నేత‌లు..!!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. రెండు నెలల్లో ఎన్నికలకు వెళ్లాల్సి ఉండడంతో రాష్ట్రంలోని పార్టీలన్నీ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ క్రమంలోనే వలసలను ప్రొత్సహిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్‌సభ సమరంలోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో వ్యూహాలను సిద్దం చేసి పెట్ట‌డంతోపాటు అదికార పార్టీ బ‌లం-బ‌ల‌హీన‌త‌ల‌పైన దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించారు జ‌గ‌న్.

 అదికార పార్టీ లో అసంత్రుప్త నేత‌ల‌పై వైసీపి ద్రుష్టి..! స్వాగ‌తం ప‌లుకుతున్న లోట‌స్ పాండ్..!!

అదికార పార్టీ లో అసంత్రుప్త నేత‌ల‌పై వైసీపి ద్రుష్టి..! స్వాగ‌తం ప‌లుకుతున్న లోట‌స్ పాండ్..!!

మరోవైపు, పార్టీలోని కీలక నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు ముఖ్యులు ఇతర పార్టీల నేతలపై ద్రుష్టి కేంద్రీక‌రించారు. అన్నింటి కంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలను కనిపెట్టేందకు ఒక టీమ్‌ను సైతం రెడీ చేశారట. ఆ టీమ్ చెప్పిన వారితో ఈ నేతలు డైరెక్టుగా మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణ మోహన్.. ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్ర బాబులతో టీడీపీకి రాజీనామా చేయించేశారు. వీరంద‌రూ వైసీపీ కండువా కప్పుకున్నారు.

 జ‌గ‌న్ విదేశం నుండి రాగానే ఊపందుకోనున్న వల‌స‌లు..! టీడిపిలో నైరాశ్యం..!!

జ‌గ‌న్ విదేశం నుండి రాగానే ఊపందుకోనున్న వల‌స‌లు..! టీడిపిలో నైరాశ్యం..!!

ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్, మ‌రో రెండు మూడు రోజుల్లో తిగిరి రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత కొత్త ఇంటి గృహ ప్రవేశం చేయనున్నారు. అదే రోజు పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీకి చెందిన ముఖ్య నేతలతో పాటు, ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలు రావాలని పార్టీ ఆదేశించినట్లు సమాచారం. అదే రోజు టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిసింది. ఇటీవల పార్టీని వీడిన ఓ ఎమ్మెల్యే కొన్ని అతీత శక్తులు ముఖ్యమంత్రిని ఆయన నివాసం, కార్యాలయంలో కలుస్తున్నాయని, అవే ఆయన్ను కీలుబొమ్మను చేసి శాసిస్తున్నాయని చెప్పారు.

బాబు తీరు ప‌ట్ల త‌మ్ముళ్ల అస‌హ‌నం..! వేరే దారి చూసుకుంటున్న నేత‌లు..!!

బాబు తీరు ప‌ట్ల త‌మ్ముళ్ల అస‌హ‌నం..! వేరే దారి చూసుకుంటున్న నేత‌లు..!!

సమాజం గురించి మాట్లాడే తనలాంటి వాళ్లకు, సామాన్యులకు ఏ స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాలను, ఆయనలో ఉన్న నీచమైన కులతత్వాన్ని ప్రశ్నించాలనే టీడీపీని వీడినట్టు వెల్లడించారు. తనలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలోకి వస్తారని తెలిపారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లే కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.దీంతో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి దెబ్బ త‌గిలేలా క‌నిపిస్తోంది.

English summary
The main Opposition in the AP is YSR Congress party, with the prospect of victory in the upcoming assembly elections and the Lok Sabha. The party president YS Jaganmohan Reddy has prepared a number of strategies and plans to destroy the ruling party strength and weaknesses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X