చెప్పుతో కొట్టాలి: జగన్-ముద్రగడలపై ఊగిపోయిన అచ్చెన్నాయుడు
కాపు నేత ముద్రగడ పద్మనాభంపై మంత్రి అచ్చెన్నాయుడు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో పదవిలో కొనసాగినంత కాలం కాపుల గురించి ముద్రగడ పట్టించుకోలేదన్నారు.
అమరావతి: కాపు నేత ముద్రగడ పద్మనాభంపై మంత్రి అచ్చెన్నాయుడు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో పదవిలో కొనసాగినంత కాలం కాపుల గురించి ముద్రగడ పట్టించుకోలేదన్నారు.
ఇప్పుడు ఏ పదవీ లేకపోవడంతో జనాల మధ్య కులచిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కాపులకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకుంటారన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారిని, అబద్దాలు చెప్పే వారిని చెప్పుతో కొట్టాలన్నారు.
ముద్రగడను జగన్ వెనుక ఉండి నడిపిస్తున్నారన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని ప్లీనరీలో జగన్ ఒక్క మాట చెప్పలేదని గుర్తు చేశారు.

డబ్బున్న వారికి మంత్రి పదవులను చంద్రబాబు ఇవ్వడం లేదని మరో మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి, ప్రజల కోసం పని చేసిన వారికే పదవులు ఇస్తున్నారన్నారు.
నంద్యాలకు తాము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని కళా వెంకట్రావు వేరుగా అన్నారు. ముద్రగడ వెనుక జగన్ ఉన్నారని, ఆయన రాజకీయం కోసమే ఉద్యమిస్తున్నారన్నారు. ముద్రగడ మర్మాన్ని కాపులు గుర్తించాలన్నారు. అనుమతి తీసుకొని పాదయాత్ర చేస్తే తప్పేమిటన్నారు.












Click it and Unblock the Notifications