పాపం జగన్! అంతా విజయసాయి వల్లే: మంత్రి అయ్యన్న ఆసక్తికరం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు జాలి చూపించారు. జగన్‌ను పాపం అన్నారు.

భూకుంభకోణాల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వైసిపి నేతలు విజయ సాయి రెడ్డి, బొత్స సత్యనారాయణలపై అయ్యన్న తీవ్రంగా మండిపడ్డారు.

 Minister Ayyanna pity at YS Jagan

అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లాడంటే ఆ పాపం అంతా విజయ సాయిరెడ్డిదేనని ఆగ్రహించారు. జగన్‌కు ఏమాత్రం రాజకీయ అవగాహన లేదని చెప్పారు. విజయసాయి రెడ్డి తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే 14 నెలలు జైల్లో ఉన్నాడన్నారు.

జగన్‌తో చిరంజీవి భేటీ, వైసిపిలోకి వెళ్తారని ప్రచారం: ఇదీ అసలు విషయం

వైసిపి నేత బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడుతూ.. ఆయన అవినీతిని తట్టుకోలేక వోక్స్ వ్యాగన్ మన రాష్ట్రం నుంచి తరలిపోయిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖలో భూముల ఆక్రమణలు జరగడం వాస్తవమేనని చెప్పారు. భూముల ధరలు పెరగడంతో పదేళ్ల నుంచి భూకబ్జాలు పెరిగాయన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP minister Chintakayala Ayyanna Patrudu said that Ys jagan spent 14 months in jail as he listened to the advice offered by Vijaya Sai Reddy.
Please Wait while comments are loading...