సింహం సింగిల్ గానే బరిలోకి : పవన్ ఆలోచన మొక్కజొన్న పొత్తులు గురించే..? మంత్రి బొత్స సెటైర్లు !!
జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చేస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైయ్యాయి. అధికార వైసీపీ నేతలు, మంత్రులు పవన్ వ్యాఖ్యలపై తీవ్ర స్పందిస్తున్నారు. రాజకీయ పరిపక్వత లేకుండా పవన్ కల్యాన్ మాట్లాడుతున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

పొత్తుల గురించి ఆలోచిస్తారో లేక మొక్కజొన్న పొత్తుల గురించో..
అసలు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే కదా..? పవన్ కల్యాణ్ చీల్చకుండా చేయడానికి అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ముందు పవన్ కల్యాన్ రాజకీయాల్లో ఉన్నారో లేదో తేల్చుకోవాలని అన్నారు. దిగజారుడు రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోని పవన్ మాట్లాడితే బాగుంటుందని బొత్సా హితవు పలికారు. ఎరవో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినంత మాత్రాన మీకు ఓట్లు పడవంటూ దుయ్యబడుతున్నారు. పవన్ కల్యాన్ జనసేన పొత్తుల గురించి ఆలోచిస్తారో లేక మొక్కజొన్న పొత్తుల గురించి ఆలోచిస్తారో చూద్దామంటూ సైటెర్లు విసిరారు.

సినిమా డైలాగులు చెబితే ఓట్లు పడవు..
పవన్ కల్యాన్ మాటల్లో స్పష్టత కొరవడిందని బొత్సా విమర్శించారు.. ఆయనకు ఒక విధానం, కార్యాచరణ లేదన్నారు. చంద్రబాబును సీఎం చేయడం కోసం జనసేన కార్యకర్తలు పనిచేయాలని పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పవన్ కల్యాన్ వి దిగజారుడు రాజకీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. నాలుగు సినిమా డైలాగులు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మి ఓట్లేయరని ఎద్దేవా చేశారు. రాజకీయాలకు, సినిమాలకు చాలా తేడా ఉంటుంది. ముందు పవన్ ఇది గుర్తుంచుకోవాలన్నారు.
Recommended Video

వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి..
జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వదిలేసి.. విమర్శలు చేయడమే పనిగా పవన్ కల్యాన్ పెట్టుకున్నారని మంత్రి బొత్సా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చర్యలు చంద్రబాబుకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బొత్స స్పష్టం చేశారు. తమతో పొత్తుకు కలిసి వచ్చేవారుంటే దానిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని స్ఫష్టం చేశారు. మరలా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తోందని బొత్స ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications