త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్: బొత్స
త్వరలో డీఎస్సీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన బొత్స పలు అంశాలపై స్పందించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించామని, త్వరలోనే బదిలీలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెలువరిస్తామన్నారు. దీనికోసం పారదర్శకమైన విధానాన్ని తీసుకురానున్నామని, ఇతర రాష్ట్రాల్లోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు.
ఏపీ కార్యనిర్వాహఖ రాజధానిగా విశాఖపట్నం అనేది తమ ప్రభుత్వ రాజధాని పాలసీ అని, దీనికోసం తాము ఏదీ డైవర్షన్ చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధానిని కాపురం కోసం పెట్టారా? అంటూ ప్రశ్నించారు. అమరావతి రాజధాని అయితే చంద్రబాబు కాపురం హైదరాబాద్ లో ఎందుకు పెట్టారని, కాపురానికి, రాజధానికి సంబంధం లేదన్నారు. కొందరు నేతలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారని, తాను ముందే చెప్పానని, ఈరోజు బిడ్డింగ్ తో అది స్పష్టమైందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలని తమ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోందని, ప్రయివేటీకరణకు వ్యతిరేకమన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఆయన చాలా మంచి నటుడని, మ్యానిపులేటర్ అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై పరిశీలిస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలిచ్చారన్నారు. రాగిజావను నిలిపేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఖండించారు. పరీక్షలు, ఒంటిపూట బడులను దృష్టిలో పట్టుకొని విద్యార్థులకు చిక్కీలిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications