Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి: మంత్రి గుడివాడ లేఖ: సింగిల్ పేజ్‌లో ఫుల్ క్లారిటీ

ప్రముఖ కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యకు ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ లేఖ రాశారు. సింగిల్ పేజ్ లెటర్ ఇది. చేగొండికి సెటైరికల్ గా ఈ లేఖ రాశారాయన.

అమరావతి: రాష్ట్ర రాజకీయాలు తెలుగుదేశం పార్టీ- జనసేన పొత్తుల వ్యవహారాల చుట్టే తిరుగుతున్నాయి. ఇదివరకే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కలుసుకున్న తరువాత మొదలైన ఊహాగానాలకు తెర పడట్లేదు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమైందనే వార్తలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సీట్ల పంపకాలు మాత్రమే మిగిలివున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

పొత్తు కోసం..

పొత్తు కోసం..

గతంలో కాపు సంక్షేమ సేన నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కొన్ని కీలక సూచనలు చేస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన నిరాహార దీక్ష కూడా చేపట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే పొత్తులు తప్పవని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండటానికి పొత్తులు అత్యవసరమనీ అభిప్రాయపడ్డారు. పొత్తులు ఉంటే తప్ప వైసీపీని ఓడించలేమనీ పేర్కొన్నారు.

ఆ సత్తా..

ఆ సత్తా..

వైసీపీని ఓడించే సత్తా టీడీపీ-జనసేనకే ఉందని, ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే అది సాధ్యపడుతుందనీ హరిరామ జోగయ్య తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఉండాలనేదే కాపు సంక్షేమ సేన డిమాండ్ అని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 22 శాతం ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కి తీరాల్సిందేనని, రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవేననీ వ్యాఖ్యానించారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను దక్కించుకోవాలనేది తమ రెండో డిమాండ్ అని గుర్తు చేశారు.

కాపు కులస్తులకే..

కాపు కులస్తులకే..

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగితే- తమ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పేరును ప్రకటించాల్సి ఉంటుందని మెలిక పెట్టారు హరిరామ జోగయ్య. కాపు సామాజిక వర్గం చేతుల్లోకి పరిపాలన రావాల్సిన అవసరం ఉందని, తమ ఎదురు చూపులు ఫలించాలని అన్నారు.

బడుగు, బలహీన వర్గాలను అధికారంలో భాగస్వామ్యులను చేయాలని చెప్పారు. ఈ డిమాండ్ల సాధనే ధ్యేయంగా జనసేన పార్టీకి అనుబంధంగా కాపు సంక్షేమ సేన ఆవిర్భవించిందని అన్నారు.

గుడివాడ తిరుగు లేఖ..

ఈ పరిణామాల మధ్య తాజాగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్.. చేగొండి హరిరామ జోగయ్యకు లేఖ రాశారు. సెటైరికల్ గా రాసిన సింగిల్ పేజ్ లెటర్ ఇది. గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి, నమస్కారములు అంటూ మొదలు పెట్టిన ఈ లేఖ అయిదే అయిదు లైన్లతో ముగిసింది.

పొరపాటున..

పొరపాటున..

కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జత కడుతున్న పవన్ కల్యాణ్ కు రాయవలసిన, చెప్పవలసిన విషయాలను పొరపాటున తనకు రాశారని గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. హరిరామ జోగయ్య ఆయురారోగ్యాలతో పాటు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.. అంటూ ముగించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలంటూ హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో గుడివాడ అమర్ నాథ్ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

అంతకుముందు చేగొండి హరిరామ జోగయ్య మంత్రి గుడివాడకు ఘాటు లేఖ రాశారు. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రిపదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ ను పాడు చేయొద్దంటూ సూచించారు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నానని, అనవసరంగా పవన్ కల్యాణ్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేయొద్దని సూచించారు. దీనికి అదే స్థాయిల్ బదులిచ్చారు మంత్రి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+