మరోసారి చంద్రబాబు అరెస్ట్ ఖాయం..!!
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు ను సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో క్వాష్ పిటీషన్ లో సుప్రీంకోర్టులో ఆసక్తికర తీర్పు వచ్చింది. చంద్రబాబు ఈ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని అభ్యర్దించారు. ఈ కేసులో ప్రధానంగా ప్రస్తావించిన 17ఏ పైన ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో న్యాయస్థానం అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.
ఇక, ఈ కేసు పైన టీడీపీ స్పందిస్తున్న తీరును వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దీని పైన స్పందించారు. చంద్రబాబు పై కేసు నమోదు, విచారణ, రిమాండ్, అరెస్ట్ అన్నీ సక్రమమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని చెప్పుకొచ్చారు. కొందరు చంద్రబాబుకు భారీ ఊరటగా చెబుతున్నారని, కోర్టు దోషి అని చెప్పినా ఊరట ఏంటని ప్రశ్నించారు. కేసును క్వాష్ చేయటానికి సుప్రీం కోర్టు అంగీకరించలేదని గుర్తు చేసారు. ప్రాధమికంగా చంద్రబాబు దోషి అని తేల్చిందని మంత్రి వివరించారు. 17ఏ కింద అనుమతి తీసుకుంటే బాగుండేదని మాత్రమే ఒక జడ్జి అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడైనా తీసుకోమని సూచించారని వివరించారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోలేరని మంత్రి కాకాని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు మరోసారి అరెస్ట్ ఖాయమని మంత్రి కాకాని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇటు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ కేసులో ఇప్పుడు సుప్రీం సీజే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయిదుగురు సభ్యుల బెంచ్ కు కేసును కేటాయిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధ్యయనం చేయటంతో పాటుగా..ఇద్దరు న్యాయమూర్తులు 17ఏ గురించి వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాల పైన వాదనలు విననున్నారు. ఆ తరువాత ఇచ్చే తీర్పు కీలకం కానుంది. ఇదే సమయంలో ఈరోజున సుప్రీంకోర్టులో చంద్రబాబు పైన నమోదైన ఫైబర్ నెట్ కేసులో బెయిల్ వ్యవహారం పైన జరగాల్సిన విచారణ జరగలేదు. అటు మరో మూడు కేసుల్లో ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఎన్నికల వేళ చంద్రబాబు కేసుల వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications