పవన్ నెత్తిమీద శనిలా చంద్రబాబు.. అందుకే ఇలా పిచ్చివాగుడు: వదిలిపెట్టని మంత్రి!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పిచ్చోడి మాటల్లా ఉన్నాయని పేర్కొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ చంద్రబాబు అనే శని, పవన్ నెత్తిమీద ఉన్నాడని అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు మన ఇళ్లల్లో వాళ్ళేనని, మన పిల్లలే అని, మన ఇళ్లలోని వాళ్లే వాలంటీర్లు అయ్యారని , ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్లు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

అన్ని ప్రామాణికతను పాటించిన తర్వాతనే వాలంటీర్ల ఎంపిక జరిగిందని, అటువంటి వాలంటీర్లను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. పవన్ తన వ్యాఖ్యల పర్యవసానం కచ్చితంగా చూస్తారని మంత్రి కొట్టు సత్యన్నారాయణ అభిప్రాయపడ్డారు. కాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు .
పవన్ కళ్యాణ్ అవగాహన లేమితో వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అసలు ప్రజల్లో ఏం చర్చ జరుగుతుందో పవన్ కు తెలియడం లేదని విమర్శించారు. బురద జల్లడం పవన్ కళ్యాణ్ కు అలవాటు అయిందని ఆయన మండిపడ్డారు. ప్రజల్లో వాలంటీర్లకు, ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పవన్ కు కడుపు మంట గా ఉందని అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ కు కొంచెమైనా ఆలోచన, సభ్యత ఉందా? అంటూ ప్రశ్నించిన కురసాల కన్నబాబు సభ్యత, సంస్కారం లేకుండా ఎవరిని పడితే వాళ్లను దూషిస్తున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్ పై కక్ష, ద్వేషం, అసూయ తోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన కారణంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో 2.80 లక్షల మంది ప్రజల మనోభావాలు దెబ్బ తీశానన్న ఆలోచన పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు కురసాల కన్నబాబు.












Click it and Unblock the Notifications