జగన్ సాక్షి కేసులో తగ్గేదేలే అంటున్న నారా లోకేష్, వస్తావా !!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రాజకీయ పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకుల పరిస్థితి తల్లకిందులు అయ్యింది. గతంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల మీద ఎలాంటి కేసులు నమోదు చేశారో ఇప్పుడు అలాంటి కేసులు నమోదు చేస్తున్నారని సమాచారం.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అనేక కేసులు నమోదు అయ్యాయి. ఆ సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్లారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటిసారి జగన్ సీఎం గా ఉన్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు నమోదైనాయి.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తన పైన సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించి తన పరువుకి భంగం కలిగించారని నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు. సాక్షి పత్రిక పైన రూ. 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. తనపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేశారని, ప్రజల్లో తన పరువు కి భంగం కలిగించారని తన హోదాని తగ్గించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ నారా లోకేష్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసులో నారా లోకేష్ కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. తన గురించి సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు వచ్చాయని, లేనిపోనివి వార్తలు రాశారని, అబద్దాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు. తన మీద వచ్చిన తప్పుడు ప్రచారం చేస్తూ దానిని నిజం చేయాలని సాక్షి పత్రిక ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించిందని, ఆ సంస్థ పైన, సాక్షియాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని కొంతకాలంగా నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసులో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కోర్టు విచారణకు హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications