అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!!
అమరావతి కేంద్రంగా కీలక చర్చ సాగుతోంది. అమరావతికి చట్ట బద్దత కల్పిస్తూ పార్లమెంట్ లో ఆమోదించారు. దీంతో, అమరావతి కేంద్రంగా నిర్మాణాలు.. పెట్టబడులు వేగం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన మావీగన్ ప్రతిపాదన పైన రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అమరావతి ఖర్చు పైనా కొత్త చర్చ మొదలైంది. దీంతో, మంత్రి నారాయణ అమరావతిలో చేస్తున్న ఖర్చు గురించి స్పష్టత ఇచ్చారు.
అమరావతిలో నిర్మాణాలు.. ఖర్చు గురించి మంత్రి నారాయణ కీలక అంశాలను ప్రస్తావించారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్ట్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అమరావతిలో పనులు వేగంతో మూడు షిప్టుల్లో జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారుల భవనాలు మే నెలాఖరుకు పూర్తవుతాయని చెప్పారు. మే నెలాఖరు నాటికి 90 శాతం ప్రభుత్వ భవనాలు సిద్ధమవుతాయని వెల్లడించారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ పనులు 2027 నాటికి పూర్తి అవుతాయని, ఐకానిక్ టవర్లు సహా ప్రధాన నిర్మాణాలు 2028 ఆగస్టు నాటికి సిద్ధం చేస్తామని మంత్రి వెల్లడించారు. మూడు సంవత్సరాల్లో అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రాజధాని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ కాదన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. 2014లోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా స్పష్టమైన ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

తొలి విడత నిర్మాణలు వచ్చే ఏడాదికి పూర్తి
కాగా, భవిష్యత్తులో భూముల విలువ పెరుగుదల దృష్ట్యా 5 వేల ఎకరాలు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఆ భూముల విలువతో తీసుకున్న రుణాలు చెల్లించే విధంగా ప్లాన్ చేశామని వివరించారు. రాజధాని ఖర్చులపై తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతోందని.. స్క్వేర్ ఫీట్ ధరలను వక్రీకరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. హైదరాబాద్ సెక్రటేరియట్‌లో స్క్వేర్ ఫీట్‌కు రూ.12 వేలు, ఢిల్లీ సెంట్రల్ విస్టాలో రూ.16 వేలు ఖర్చు అయ్యిందని మంత్రి తెలిపారు. వాటితో పోల్చితే అమరావతి ఖర్చులు సమంజసమేనని స్పష్టం చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందని మంత్రి గుర్తు చేశారు. ప్రణాళికలకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు సాఫీగా సాగుతోందని చెప్పారు. ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ ఈ నెలలో పూర్తవుతుందని.. దీంతో ప్రాజెక్టులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని చెప్పారు.












Click it and Unblock the Notifications