ఏది మారదు: సీఎం వైఎస్ జగన్‌తో ఎస్ఎస్ రాజమౌళి భేటీపై మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

అమరావతి: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో మంత్రి పేర్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సినిమా టికెట్ల రేట్ల వివాదం సమసిపోయింది. తక్కువగా రూ.20 నుంచి 250 వరకు థియేటర్లు, ఏరియాలు, సీటింగ్‌ని బట్టి నిర్ణయించింది.

ఏపీ సీఎం జగన్‌తో ఎస్ఎస్ రాజమౌళి, దానయ్య భేటీ, కీలక చర్చ

ఏపీ సీఎం జగన్‌తో ఎస్ఎస్ రాజమౌళి, దానయ్య భేటీ, కీలక చర్చ

అంతేగాక, భారీ సినిమాలకు పది రోజులపాటు టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. చిన్న సినిమాలకు ఐదో షోకి గ్రీన్‌ సిగ్నల్‌తోపాటు, ఖచ్చితంగా ఒక్క షో చిన్న సినిమాలకు కేటాయించాలని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆర్‌ఆర్‌ఆర్‌ దర్శకుడు రాజమౌళి, ఏపీ సీఎం జగన్‌ని కలిశారు. మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలవుతున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌తో రాజమౌళి భేటీ చర్చనీయాంశంగా మారింది. హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న రాజ‌మౌళి, నిర్మాత దాన‌య్య.. అనంత‌రం అక్క‌డ్నుంచి తాడేప‌ల్లిలోని ఏపీ సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యానికి వెళ్లారు. మొదట సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానిని కలిసిన రాజమౌళి, దానయ్య అనంతరం సీఎంని కలిశారు. ఈ భేటీలో ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

సీఎం జగన్‌తో ఎస్ఎస్ రాజమౌళి భేటీపై పేర్ని నాని

సీఎం జగన్‌తో ఎస్ఎస్ రాజమౌళి భేటీపై పేర్ని నాని

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం ఏపీలో ప్రత్యేక షోలు వేసుకునే వెసులుబాటు ఇవ్వాలని సీఎం జగన్‌ని రాజమౌళి కోరినట్లు తెలిసింది. అలాగే సినిమా టిక్కెట్లు ధరల అంశంపై రాజమౌళి చర్చించారు. టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటుని ఇవ్వాలని కోరినట్టు సమాచారం. రాజమౌళి పాటు సమావేశంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రభుత్వం సినీ టికెట్ల జివో ఇచ్చిన తర్వాత సీఎంని కలిస్తామని తనను కోరినట్లు తెలిపారు. ఈ రోజు సీఎం జగన్ కలిసి రాజమౌళి, నిర్మాత దాన్యాయ కలిసి కృతజ్ఞతలు తెలిపారన్నారు. కాగా, ఏపీ ఐదుషోలకు అవకాశం ఉంది. చిన్న సినిమాకు ఒక షో ఇవ్వాలి.. అలాగే ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి లేదు. రాష్ట్రంలో 1100 థియేటర్లు పెద్ద సినిమాలు ఉంటే ఒక షో మాత్రం చిన్న సినిమాకు ఉందని నాని అన్నారు. తాజాజీవో ప్రకారమే అంతా జరుగుతుందన్నారు.

సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్న రాజమౌళి

సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్న రాజమౌళి


కాగా, సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి, దానయ్య మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్‌ సినిమా కాబట్టి.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సీఎం తమతో బాగా మాట్లాడారని, సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా దాదాపు 450కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ క్రమంలోనే టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని, మరోవైపు ప్రత్యేక షోలు వేసుకునే వెసులుబాటుని కల్పించాలని కోరారని తెలుస్తుంది. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తన్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివీయా నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+