పేదలకు ఇచ్చే స్థలాలు సమాధులా? చంద్రబాబుపై మంత్రి రోజా మండిపాటు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రి ఆర్.కె.రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేడు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం పాల్గొన్న మంత్రి రోజా చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాలంటీర్లకు సన్మానం చేసిన రోజా వాలంటీర్ వ్యవస్థతో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత జగన్ దన్నారు.
అమరావతిలో పేదలకు ఇచ్చే సెంటు స్థలాలను సమాధులు అని చంద్రబాబునాయుడు, సమాధులతో పోల్చడాన్ని మంత్రి ఆర్.కె.రోజా తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పేదలకు ఇచ్చే స్థలాన్ని సమాధులతో పోలుస్తారా? అంటూ రోజా మండిపడ్డారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వరుసగా మూడో సంవత్సరం కూడా పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని రోజా వెల్లడించారు.

చంద్రబాబు ఎన్ని చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాల్లో వైసీపీ గెలవటం ఖాయమని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏం చేసినా, ఏం చెప్పినా ప్రజలు నమ్మరని, చంద్రబాబును ఆదరించరని రోజా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి రోజా వెల్లడించారు.
ఏపీ సీఎం జగన్ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తీసుకువచ్చారని, సమసమాజ స్థాపన కోసం ఆయన పాటు పడుతున్నారని సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి వాలంటీర్ వ్యవస్థతో రాష్ట్రంలో సరికొత్త మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రోజా కొనియాడారు.
ప్రజలంతా వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకుంటుంటే, ఒక్క చంద్రబాబు మాత్రమే విమర్శలు చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. వాలంటీర్లు సంక్షేమ సేవకులు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లు వెలకట్టలేని సేవలను అందిస్తున్నారని మంత్రి రోజా కొనియాడారు.












Click it and Unblock the Notifications