పవన్ -నాగబాబు పై రోజా సంచలన కామెంట్స్ : చిరంజీవి పై తాజాగా..!!
మంత్రి రోజా మరోసారి పవన్ - నాగబాబు పైన ఫైర్ అయ్యారు. రణస్థలం సభలో పవన్ కల్యాణ్ మంత్రి రోజా పైన సీరియస్ వ్యాఖ్యలు చేసారు. దీనికి స్పందించిన మంత్రి డైమండ్ రాణి అంటూ కామెంట్ చేసిన పవన్ ఓ జోకర్ అన్నారు. జగన్ తో పోటీ పడలేను...చేతకాదని పవన్ స్వయంగా అంగీకరించారని రోజా చెప్పుకొచ్చారు. అదీ ముఖ్యమంత్రి జగన్ పవర్ అంటే అని వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ను నిలబెట్టలేని నిస్సహాస్థితిలో పవన్ ఉన్నారని ఎద్దేవా చేసారు. అదే సమయంలో చిరంజీవిపైన తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు.
మంత్రి రోజా రాజకీయంగా మెగా బ్రదర్స్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాజకీయంగా పవన్ - నాగబాబు గురించి విమర్శలు చేయటం గురించి పక్కన పెడితే..చిరంజీవి ప్రస్తావన తీసుకురావటం పైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. వైసీపీ వ్యూహాత్మకంగా చిరంజీవితో సన్నిహితంగా ఉంటూ పవన్ ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం అమలు చేసింది. దీంతీ ఇప్పుడు తాను రాజకీయాల్లో లేని చిరంజీవిపై మాట్లాడనని స్పష్టం చేసారు. మెగా ఫ్యామిలీని వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదని చెప్పారు. చిరంజీవి -బాలయ్య కు సంక్రాంతికి కొత్త సినిమాలతో కలెక్షన్లు వస్తే పవన్ కు చంద్రబాబు నుంచి కలెక్షన్లు వచ్చాయని వ్యాఖ్యానించారు.

నాగబాబు మనిషి ఎదిగారు గానీ, మెదడు పెరగలేదని రోజా సీరియస్ కామెంట్ చేసారు. రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు. అమ్ముడుపోయే వ్యక్తులు తమ గురించి మాట్లాడితే ఊరుకోమన్నారు. తాను కళాకారులతో డ్యాన్స్ చేస్తే.. వారు ట్రోల్ చేస్తున్నారని.. వారు మాత్రం కూతురు వయస్సున్న అమ్మాయిలతో డ్యాన్స్ చేయడం ఓకేనా ప్రశ్నించారు. పవన్ అన్నింటిలోనూ ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. చిరంజీవి ఉండబట్టే ఆయనకు సినిమా అవకాశాలు వచ్చాయన్నారు. తాను స్వయం కృషితో ఎదిగానని రోజా చెప్పుకొచ్చారు. చిరంజీవితో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవన్నారు. చంద్రబాబుపై కూడా మంత్రి రోజా ఫైరయ్యారు. చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను.. మంటలో కలిపారని రోజా ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications