ఢిల్లీ వాడు వెక్కిరించినా - నిజమైన ఆంధ్రోడు : రోజా కీలక వ్యాఖ్యలు..!!
విశాఖ సదస్సు వేళ మంత్రి రోజా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
విశాఖ కేంద్రం అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రులతో పాలుగా 26 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వారికి ఆతిథ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. పలువరు పారిశ్రామిక దిగ్గజాలు విశాఖకు తరలి వస్తున్నారు. విశాఖతో పాటుగా రాజమండ్రి విమానాశ్రయాల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసారు. దాదాపు రెండు లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఈ సదస్సు ద్వారా ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇదే సమయంలో ఈ సదస్సు నిర్వహణ వేళ మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా కీలక పోస్టింగ్ చేసారు.
విశాఖలో గ్లోబల్ సమిట్ లో పాల్గొనేందుకు అంతర్జాతీయ - జాతీయ ప్రముఖులు రేపు ఉదయానికి విశాఖ చేరుకుంటున్నారు. దాదాపు 8 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. సదస్సులో రెండు రోజుల పాటు పలు సెషన్లు జరగనున్నాయి. రెండు రోజుల సదస్సు ప్రారంభం వేళ సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.

పలువురు వ్యాపార దిగ్గజాలతో ఏపీలో పెట్టుబడుల కోసం ఒప్పందాలు జరగనున్నాయి. ఈ సదస్సు పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ప్రధానంగా పర్యాటక ..ఆతిధ్య రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల పైన ఆసక్తి కనిపిస్తోంది. ఏపీలో పర్యాటక రంగంలో ఉన్న అవకాశాల పైన ప్రత్యేక ప్రజెంటేషన్ - సెషన్ ఏర్పాటు చేసారు. ఏపీ పర్యటక మంత్రి రోజా ఇదే సమయంలో విశాఖలో సదస్సు వేళ..పక్క రాష్ట్రాలకు ధీటుగా మా వైజాగ్ ను తీర్చి దిద్దుతాం అంటూ ట్వీట్ చేసారు.
ఢిల్లీ వాడు వెక్కిరించినా
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 2, 2023
మద్రాస్ వాడు వెళ్లగొట్టినా
హైదరాబాద్ వాడు గెంటేసినా
మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం...
పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్ ను తీర్చి దిద్దుతాం
- నిజమైన ఆంధ్రోడు 💪
VIZAG WELCOMES YOU 💐#YSJaganMarkGovernance#AdvantageAP #APGIS2023 pic.twitter.com/Br24qIafHc
మంత్రి రోజా తన ట్వీట్ లో.. ఢిల్లీ వాడు వెక్కిరించినా ..మద్రాస్ వాడు వెళ్లగొట్టినా ..హైదరాబాద్ వాడు గెంటేసినా ..మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం... పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్ ను తీర్చి దిద్దుతాం..- నిజమైన ఆంధ్రోడు అంటూ ట్వీట్ చేసారు. అందులో వైజాగ్ వెల్ కమ్స్ యూ అంటూ పేర్కొన్నారు. విశాఖ సదస్సు వేళ మంత్రి రోజా చేసిన ఈ ట్వీట్ ఆసక్తి కరంగా మారింది. ఈ ట్వీట్ కు ఒక వీడియోను జత చేసారు. అందులో అడ్వాంటేజ్ ఏపీ పేరుతో సదస్సు వేళ ఏపీ ప్రభుత్వం తమ విజయాలను వివరిస్తూ.. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తొలి స్థానంలో నిలవటం..11.43 శాతంతో డబుల్ డిజిట్ గ్రోత్ వంటి అంశాలను వివరించారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications