ఫించన్ పొందే వ్యాధిగ్రస్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక నుంచి..!!
ఏపీలో ఆసరా ఫించన్ల కింద రూ 10 వేలు పొందుతున్నవ్యాధిగ్రస్తులకు ఉచిత బస్ పాస్ లు అందించనున్నట్లు మంత్రి విడదల రజనీ ప్రకటించారు.సికెల్ సెల్ ఎనీమియా, థలసేమియా వంటి రోగాలతో బాధపడే వారికి దీని వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఐబ్రెస్ట్ అనే పరికరం ద్వారా మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్దారణ పరీక్షలను ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఏపీ ప్రభుత్వం ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. క్యాన్సర్, కిడ్నీ లాంటి ప్రాయాణపాయ రోగులకు ముఖ్యమంత్రి జగన్ పూర్తి స్థాయిలో అండగా నిలిచారని మంత్రి రజనీ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ ను పూర్తిస్థాయిలో డెవలప్ చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిధిలోని అన్ని క్యాన్సర్ ఆస్పత్రుల్లో పాలియేటివ్ కేర్ కోసం ఖచ్చితంగా 5 శాతం పడకలను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పరిధిలోని అన్ని క్యాన్సర్ ఆస్పత్రులు హోమీబాబా క్యాన్సర్్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్ గ్రిడ్ కు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుతో పాటుగా, పలాసలో కిడ్నీ కేర్ సెంటర్ ను అతి త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. కిడ్నీ రోగులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందచేస్తామని మంత్రి వెల్లడించారు. భౌతికకాయాల తరలింపుకు వినియోగించే మహాప్రస్థానం వాహనాలను ఏరియా ఆస్పత్రుల్లోనే అందబాటులోకి తేవాలన్నారు. కొత్తగా 108 అంబుటెన్సులను వాడుకలోకి తెచ్చనిందున పాతవాటి పని తీరు గుర్తించి బాగున్నవి మహాప్రస్థానం కింద వినియోగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి రజనీ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications