అందుకోసమే పవన్ ఈ అలజడి - మంత్రి రజని..!!
టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ కల్యాణ్ పైన మంత్రి విడదల రజనీ కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్, చంద్రబాబుల ముసుగు తొలగిపోయిందని వ్యాఖ్యానించారు. విశాఖ సంఘటనను అడ్డం పెట్టుకొని ఇద్దరూ బయటపడ్డారని చెప్పుకొచ్చారు. విశాఖ గర్జన విజయవంతం కావడంతో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ ఈ అలజడి సృష్టించారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష దారుణంగా ఉందని మంత్రి రజనీ ఆగ్రహం వ్యక్తం చేసారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం 20 చొప్పున 108, 104 వాహనాలను మంత్రి ప్రారంభించారు.
దివంగత సీఎం వైఎస్సార్ నాడు ఆరోగ్య రంగానికి పునాదులు వేసారని.. సీఎం జగన్ ఇప్పుడు విప్లవాత్మక మార్పులతో మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల్ని మరింత మెరుగు చేసేందుకు రెండు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 104, 108 వాహనాల ద్వారా 25 వేల మందికి ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, మందులు అందిస్తామని వెల్లడించారు. విశాఖ గర్జన విజయవంతం కావడంతో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ ఈ అలజడి సృష్టించారని మండిపడ్డారు.

పవన్‌లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని విడదల రజిని వ్యాఖ్యానించారు. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారప్పారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ పయనిస్తున్నాడని విమర్శించారు. పవన్ కు మతి భ్రమించిందని మండిపడ్డారు. అధికారంలో ఉండగా రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు, ఇప్పుడు పల్నాడు జిల్లాలో పంట పొలాల పరిశీలనకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అన్నదాతలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి రజనీ విమర్శించారు.












Click it and Unblock the Notifications