జగన్‌కు కౌంటర్: 'అమరావతి'కి రూ.9 కోట్లే!, సొంత ఖర్చుతో విఐపీలు, స్పాన్సర్స్
గుంటూరు: రాజధాని అమరావతి శంకుస్థాపనకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్న విపక్ష నేతలు వైయస్ జగన్, రఘువీరా రెడ్డి వ్యాఖ్యల పైన మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలు గురువారం నాడు స్పందించారు.
రాజధాని శంకుస్థాపనకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామనే ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ప్రభుత్వం పైన విమర్శలు సరికాదన్నారు. శంకుస్థాపనకు ఇప్పటి వరకు రూ.9 కోట్ల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయని వివరించారు.

రాజధాని శంకుస్థాపనకు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయని, కానీ అది శుద్ధ అబద్దమన్నారు.
ఇప్పటి వరకు గుంటూరు జిల్లా కలెక్టర్ రూ.7 కోట్లు, కృష్ణా జిల్లా కలెక్టర్ రూ.2 కోట్లు విడుదల చేశారన్నారు. రాజధాని ఖర్చును ఎక్కువ మంది స్పాన్సర్ చేస్తున్నారని చెప్పారు. చాలామంది ప్రముఖులు తమ సొంత ఖర్చుతో వస్తున్నారని తెలిపారు.
అమరావతి శంకుస్థాపనకు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తామని మంత్రులు చెప్పారు. అయితే రావడం, రాకపోవడం ఆయన ఇష్టానికి, ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నట్లు చెప్పారు.
జగన్ దీక్ష: టిడిపి నేతలపై ఉండవల్లి ఆగ్రహం
జగన్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మద్దతుగా నిలిచారు. ఉదయం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ నిరాహార దీక్ష డ్రామా అని ఆరోపిస్తున్న మంత్రులు, అదే దీక్షను ఎందుకు
ఆపివేయించారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆయన దీక్ష చేపడితే, బాబు మంత్రివర్గం అర్థంలేని వ్యాఖ్యలు చేసిందన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేయలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతుంటే విమర్శించడం తగదన్నారు.
పోలవరం ప్రాజెక్టును వివాదాస్పదం చేస్తే టీడీపీని ప్రజలు క్షమించరన్నారు. మిత్రపక్షంగా ఉండి బీజేపీ చేస్తున్న ఆరోపణలకు సైతం టిడిపి సమాధానం ఇవ్వలేకపోతోందన్నారు. ముఖ్యమంత్రిగా కన్నా ఈవెంట్ మేనేజర్‌గా
విజయం సాధిస్తున్న చంద్రబాబు, మరోసారి ఎన్నికలు వస్తే నామరూపాల్లేకుండా పోతారన్నారు.












Click it and Unblock the Notifications