స్వలింగ సంపర్కాన్ని ప్రతిఘటించింన బాలుడిపై దాడి

హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని సైదాబాద్‌లోని మదర్సాలో చదువుకుంటున్న 12 ఏళ్ల బాలుడితో 14 ఏళ్ల బాలుడు హోమో సెక్స్‌కు పాల్పడేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో దాడి చేసి తీవ్రంగా గాయపరచి చెట్ల పొదల్లో పడేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడ్ని గురువారం మలక్‌పేట పోలీసులు గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు.

మదర్సాలో చదువుతున్న ఓ బాలుడు బుధవారం మధ్యాహ్నం నుంచి పోయాడు. దీంతో అపహరణకు గురయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, అతను తోటి విద్యార్థితో స్వలింగ సంపర్కాన్ని అంగీకరించనందుకు దాడికి గురైనట్లు పోలీసులు గుర్తించారు.

 Minor attacked for resisting sexual advances

బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు, వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన 12 ఏళ్ల బాలుడు సైదాబాద్‌లోని ఫయాజ్ ఉల్ ఉలూమ్ మదర్సాలో చదువుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం 14 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి ఆస్మాన్‌ఘడ్‌లోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ హోమో సెక్స్‌కు ప్రయత్నించాడు. అందుకు 12 ఏళ్ల బాలుడు తిరస్కరించి ప్రతిఘటించడంతో అతనిపై దాడికి పాల్పడ్డాడు.

తీవ్రంగా గాయపడ్డ 12 ఏళ్ల బాలుడు అపస్మాకరస్థితికి చేరడంతో అక్కడే చెట్ల పొదల్లో పడేశాడు. మదర్సాకు చేరుకుని తోటి బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడని కట్టుకథ చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మదర్సా నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి నుంచి వివరాలు రాబట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ ఎన్.సత్యనారాయణ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి కిడ్నాప్ జరిగినట్టు చెప్పిన ప్రాంతానికి వెళ్లి గాలిస్తుండగా చెట్ల పొదల్లో అపస్మారకస్థితిలో ఉన్న 12 ఏళ్ల బాలుడు కనిపించాడు. వెంటనే అతడ్ని మలక్‌పేట యశోదా ఆస్పత్రికి తరలించారు.

బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ విషమంగానే ఉందని యశోదా ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషన్‌రావు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడ్ని మలక్‌పేట డివిజన్ ఎసిపి సుధాకర్ పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. తోటి బాలుడు తనను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి హోమో సెక్స్‌కు యత్నించగా ప్రతిఘటించానని, తనపై దాడి చేసి రాళ్లతో కొట్టాడని, దాంతో స్పృహ కోల్పోయానని బాధితుడు చెప్పినట్టు సమాచారం. బాలుడిపై దాడికి పాల్పడ్డ మరో బాలుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు మలక్‌పేట పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+