సచివాలయంలో మంటలు, ఉద్యోగుల పరుగు: పనిలేనివారు, సీమకు ఇంకేం కావాలి: కెఈ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో శుక్రవారం ఉదయం విద్యుదాఘాతం సంభవించింది. రెవెన్యూ విభాగంలో విద్యుదాఘాతం సంభవించడంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు.

సచివాలయంలోని ఎల్ బ్లాక్ నాలుగో అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం ఇవ్వడంతో ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Minor fire breaks out at AP secretariat

పనిలేనివారే ఉద్యమాలు చేస్తున్నారు: కేఈ

రాయలసీమ హక్కుల పేరుతో ఉద్యమాలు చేస్తున్న వారిపై ఉప ముఖ్యమంత్రి సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనిలేనివారే ఇలా ఉద్యమాలు చేస్తుంటారన్నారు. ప్రజలు వాటిని పట్టించుకోరన్నారు. సీమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.

సీమలో పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అంబుజ, జైన్ మెగా ఫుడ్ ఫ్యాక్టరీ, ట్రిపుల్ ఐటీ, డీఆర్డిఏ, ఉర్దు వర్శిటీ ఇవన్నీ ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు అనుమతించారన్నారు. ఇంతకంటే సీమవాసులకు ఏం కావాలన్నారు.

రాయలసీమ అభివృద్ధికి ఒక్కొక్కటిగా సాధించుకుంటున్నామన్నారు. అసంతృప్తి అనేది లేదన్నారు. తాను చూస్తున్న రెండు శాఖల్లోనూ అవినీతి పూర్తిగా తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నానని కెఈ కృష్ణమూర్తి చెప్పారు.

మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పైన మంత్రి రావెల కిశోర్ మండిపడిన విషయం తెలిసిందే. కన్నా తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారని, అలాంటి వ్యక్తి కుమారుడు ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని, ఏ రకంగా సంపాదించారని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+