ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కాల్పుల కలకలం, ఇన్స్‌పెక్టర్‌కు గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ఏపీ భవన్ నుంచి ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో ఢిల్లీ పోలీసులు అలర్టయ్యారు. అయితే, ఓ తుపాకీ మిస్ ఫైర్ కారణంగా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.

ఏపీ భవన్లోని గది నెంబర్ 404 నుంచి కాల్పులు వచ్చాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.
ఈ కాల్పులు ఎలా జరిగాయన్న దాని పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, మిస్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇన్స్‌పెక్టర్‌కు గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications