తొమ్మిదో తరగతి విద్యార్థితో టీచర్ మిస్సింగ్: కర్నూలులో కలకలం..

ఢిల్లీ వెళ్తుండగా ఇద్దరిని భోపాల్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలు: ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి, మరో ఉపాధ్యాయిని కలిసి కనిపించకుండా పోయిన ఘటన కర్నూలులో కలకలం రేపింది. చెప్పా పెట్టకుండా వీరిద్దరు అదృశ్యమైపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ భోపాల్ లో పట్టుబడటంతో మిస్టరీ సుఖాంతమైంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు పాతబస్తీకి చెందిన 14 ఏళ్ల బాలుడు స్థానిక స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో 28 ఏళ్ల యువతి ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. ఈ నెల 3న వీరిద్దరు కనిపించకుండా పోయారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు మరుసటిరోజు ఉదయం కర్నూలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Missing teacher, student traced in bhopal

దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్లలో సీసీటీవి ఫుటేజీలను పరిశీలించగా.. ఇద్దరూ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్వే పోలీసులను అప్రమత్తం చేయగా వారు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని పర్యాటక స్థలాలను చూడటానికే తాము వెళ్లినట్లు ఆ ఇద్దరు పేర్కొనడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+