జగన్‌కు ఆదినారాయణ రెడ్డి చిచ్చు: పార్టీకి దూరం, రాజీకి నో

కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు పార్టీ శానససభ్యుడు ఆదినారాయణ రెడ్డితో విభేదాలు రచ్చకెక్కాయి. చాలా కాలంగా ఆదినారాయణ రెడ్డి జగన్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, తాను జగన్‌కు దూరంగా ఉన్న విషయాన్ని ఆయన తాజాగా శనివారం వెల్లడించారు.

పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో భేదాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమేనని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆదినారాయణ రెడ్డి ఆ విషయం చెప్పారు. జగన్‌ తీరు నచ్చకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉన్నానని, మధ్యవర్తులు రాజీప్రయత్నం చేసినా వెళ్లలేదని ఆయన తెలిపారు.

Adinaryana Reddy- Jagan

జగన్‌ రాజకీయాల్లో పరణతి చెందిల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, టీడీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని ఆయన తెలిపారు. నియోజవర్గ ప్రజలతో మాట్లాడి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. వైయస్ జగన్ తీరుపై విశాఖపట్నం జిల్లా అరకు లోకసభ సభ్యురాలు కొత్తపల్లి గీత కూడా విమర్సలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో అక్టోబర్ నెలలో నిర్వహించిన పార్టీ విస్తృస్థాయి సమావేశానికి కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి సోదరులు గైర్హాజరయ్యారు. వీరి గైర్హాజరీ పార్టీలో అప్పుడే చర్చనీయాంశంగా మారింది. వారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉండి ఉండవచ్చుననే వాదనలు వినిపించాయి.

కాగా, మరో పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే తెలుగుదేశం పార్టీకి ఫిరాయించారు. మరో ఇద్దరు, ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే పుకార్లు వెలువడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+