వైజాగ్‌లోనే పాతేస్తా: అధికారులపై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే? సుజయ సహా అవాక్కు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అప్పలనాయుడు అధికారులపై రెచ్చిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. విజయనగరం జిల్లా పరిషత్ సర్వ సభ్య సభ్య సమావేశంలో అధికారులపై ఆయన తిట్ల దండకం అందుకున్నారు. బిల్లులు క్లియర్ చేయరా.. వేషాలేస్తున్నారు అని ఊగిపోయారు.

ఊహించని షాక్, బిత్తరపోయిన టీడీపీ: తిరిగి వైసీపీలోకి రవికాంత్, దెబ్బకు దెబ్బకొట్టిన నాని

బయటకు రండి మీ అంతు చూస్తానని, విశాఖలోనే అంతు చూస్తానని, పాతేస్తానని అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని తెలుస్తోంది. అధికారులు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే మాత్రం దానిని వినిపించుకోలేదని అంటున్నారు.

 మంత్రి సుజయ తదితరుల సంక్షంలోనే

మంత్రి సుజయ తదితరుల సంక్షంలోనే

ప్రజాప్రతినిధులు, అధికారులే కాకుండా స్వయంగా మంత్రి సుజయ కృష్ణ రంగారావు సమక్షంలోనే ఎమ్మెల్యే తన ప్రతాపం చూపారని తెలుస్తోంది. దీనికి అక్కడున్న వారంతా అవాక్కయ్యారని తెలుస్తోంది. కాంట్రాక్ట్ బిల్లులు విడుదల చేయలేదని ఆగ్రహిస్తూ ఆయన అధికారులపై విరుచుకుపడ్డారు. అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడ్డారని మండిపడ్డారు.

 టీడీపీ సభ్యుల ప్రశ్నలు

టీడీపీ సభ్యుల ప్రశ్నలు

సర్వ సభ్య సమావేశం ఆదివారం జరిగింది. బడ్జెట్‌ను ఆమోదించారు. పంచాయతీరాజ్ రోడ్ల పనులకు సంబంధించి బిల్లులు సకాలంలో విడుదల చేయడం లేదని, తమ ప్రాంతంలో జరిగే అధికారిక సమావేశాలకు తమను పిలువడం లేదనే అంశాలపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు.

 కమీషన్ల కోసం కక్కుర్తి అని

కమీషన్ల కోసం కక్కుర్తి అని

వీటికి అధికారులు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే అప్పలనాయుడు విరుచుకుపడ్డారని అంటున్నారు. ఇంజినీరింగ్ అధికారులు సక్రమంగా పని చేయడం లేదని, కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని తీవ్రంగా విమర్శలు గుప్పించారని తెలుస్తోంది.

 ఉద్యోగుల ఆగ్రహం

ఉద్యోగుల ఆగ్రహం

ఎమ్మెల్యే తీరుపై అధికారులు, ఉద్యోగాలు మండిపడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఉద్యోగులు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జెడ్పీ సమావేశంలో అధికారులను తిట్టడాన్ని ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో పనులు చేయడం కష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam MLA Appala Naidu fires at officers in ZP meeting on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి