లోకేష్! ఎలా అడుగుతారు, ఇదీ నంద్యాల నైతికత: సుచరితా రెడ్డి
చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు ఇచ్చిన 32 హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని, అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని నంద్యాల ఉప ఎన్నికలలో ఓట్లు అడుగుతారని పాణ్యం వైసిపి ఎమ్మెల్యే గౌరు సుచరితా రెడ్డి ప్రశ్నించారు.
కర్నూలు: చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు ఇచ్చిన 32 హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని, అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని నంద్యాల ఉప ఎన్నికలలో ఓట్లు అడుగుతారని పాణ్యం వైసిపి ఎమ్మెల్యే గౌరు సుచరితా రెడ్డి ప్రశ్నించారు.
అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అలాంటప్పుడు ఓట్లు ఎలా అడుగుతారో చెప్పాలని మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నించారు.

గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తదితర ప్రాజెక్టులు ఇంత వరకు ప్రారంభమే కాలేదన్నారు. పాత పనులకు పైపై మెరుగులు దిద్ది అభివృద్ధి అంటే ఎలా అన్నారు.
దమ్ముంటే పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు తీసుకు వచ్చి నిర్మాణాలను త్వరితగతిన చేపట్టి ఓట్లు అడగాలన్నారు.
నంద్యాల నియోజకవర్గ ప్రజలు గతంలో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని చేసి తమ నైతికతను చాటుకున్నారన్నారు. మంత్రుల ముసుగులో తండ్రీ, కొడుకులు చేపట్టిన ప్రచారాన్ని చూసి ప్రజలు మభ్య పడే రోజులు పోయాయన్నారు. అసమ్మతి నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఎర చూపుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications