పూటుగా తాగి హోటల్లో గదులు కావాలని చిందులు తొక్కిన ఎమ్మెల్యేలు
పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా తాగి విశాఖపట్నంలో చిందులు వేసిన వైనం వెలుగు చూసింది.
అమరావతి: పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా తాగి విశాఖపట్నంలో చిందులు వేసిన వైనం వెలుగు చూసింది.
విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు వచ్చారు. అనంతరం నోవాటెల్ హోటల్ వద్దకు గురువారం అర్ధరాత్రి వచ్చి తమకు గదులు కావాలని సిబ్బందిపై చిందులు తొక్కారు.

అయితే ఎమ్మెల్యేలకు మరో హోటల్లో గదులు కేటాయించామని అధికారులు చెప్పినా వినిపించుకోలేదు. నోవాటెల్లోనే కావాలని పట్టుబడ్డారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు బాగా తాగి ఉన్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications