• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ ఏపీ పగ్గాలు మాధవ్ చేతికి? ఉత్తరాంధ్ర.. బీసీ కార్డు.. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ కలిసొస్తాయా?

|

అమరావతి: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌కు అప్పగించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం త్వరలోనే ముగియబోతోంది. ఆయన స్థానంలో పార్టీ అధిష్టానం మాధవ్‌ను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. కన్నా లక్ష్మీనారాయణనే కొనసాగించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ.. నాయకత్వ మార్పిడి వైపే మొగ్గు చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

బీజేపీ అధ్యక్ష రేసులో సీనియర్ల ఉన్నప్పటికీ..

బీజేపీ అధ్యక్ష రేసులో సీనియర్ల ఉన్నప్పటికీ..

బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్ష కోసం ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువే. గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రకాశం జిల్లా నుంచి కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, రాయలసీమ నుంచి సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు బీజేపీ అధ్యక్ష స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. వారిలో విష్ణువర్ధన్ రెడ్డి జూనియర్. రాయలసీమకు చెందిన వ్యక్తి కావడం ఒక్కటే ఆయనకు కలిసి వచ్చే అంశం. ఆ ఒక్క కారణంతో సోమగుంట పేరును బీజేపీ అధిష్ఠానం అసలు పరిశీలనలోకి తీసుకోలేదని అంటున్నారు.

ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ..

ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ..

సోము వీర్రాజుకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. వివిధ అంశాలపై అవగాహన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. రాజకీయ ప్రత్యర్ధులపై పదునైన విమర్శలను సంధించే సామర్థ్యం ఉంది. అంశాలవారీగా విమర్శకుల నోళ్లను మూయించగలరనే పేరు సోము వీర్రాజుకు ఉంది. అవేవీ- ప్రస్తుతం అక్కరకు రాలేకపోవచ్చని అంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడమే మైనస్ పాయింట్‌గా మారొచ్చని చెబుతున్నారు.

వరుసగా రెండోసారి కాపు కులానికే అవకాశం ఇవ్వడం సరికాదనే..

వరుసగా రెండోసారి కాపు కులానికే అవకాశం ఇవ్వడం సరికాదనే..

బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. పార్టీ సీనియర్ నాయకుడు, అధ్యక్ష పదవి రేసలో ముందంజలో ఉన్న సోము వీర్రాజు అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. వరుసగా రెండోసారి కాపు సామాజిక వర్గానికే అధ్యక్ష పదవిని అప్పగించడం వల్ల వెనుకబడిన వర్గాలకు చెందిన నేతల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బీసీ నాయకుడు కావడం వల్లే..

బీసీ నాయకుడు కావడం వల్లే..

బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం మాధవ్‌ను ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. మాధవ్.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడు. పైగా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నేత. చాలాకాలం నుంచి పార్టీలో ఉంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆయన శాసన మండలిలో అడుగు పెట్టారు. మాధవ్‌కే పార్టీ పగ్గాలను అప్పగించడానికి అన్ని అంశాలు కలిసి వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

  YSRCP MLA Gudiwada Amarnath Reddy Press Meet | Oneindia Telugu
  ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ అదనపు బలం..

  ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ అదనపు బలం..

  స్వతహాగా మాధవ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి వచ్చిన నాయకుడు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఆయనలో స్పష్టం కనిపిస్తుంటుంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం అదనను బలంగా మారుతుందని విశ్లేషకులు అంచనా. వివాదరహితుడని, అందర్నీ కలుపుకొని వెళ్లే మనస్తత్వం ఉండటం.. వంటి సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకుని బీజేపీ జాతీయ అధిష్ఠానం మాధవ్ పేరునే ఖరారు చేయవచ్చని చెబుతున్నారు.

  English summary
  BJP MLC PVN Madhav has reportedly emerged as the frontrunner for the post of president of BJP State wing. The BJP high command has been reconstituting State wings and as part of it, there will be a change of guard in AP party unit, sources said. Madhav, who began his political career in the RSS, may have an edge as he is young. Besides, Madhav has a clean image. As Vizag will be made the executive capital, the party is also reportedly favouring a leader from the region.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more