సోనియా కృషి: తెరాసలో చేరిన ఎమ్మెల్సీ, బాబు కుట్ర

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరిన సమయంలో పలువురు నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు తెలంగాణపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు.

ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఈ రోజు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చేరుతుండటం శుభపరిణామన్నారు. బంగారు తెలంగాణను మార్చుకోవాల్సి ఉందన్నారు. ఈ రాష్ట్రానికి ఎన్నో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ రాకుండా, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఎపిలో కలుపుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకే తాము తెరాసలో చేరుతున్నామన్నారు. మన పరిపాలన మనం చేసుకోవాలన్నారు. విద్యుత్ రాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వీటన్నింటిని తిప్పికొట్టాల్సి ఉందన్నారు.

ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మన రాష్ట్రం మన పాలనతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి కెసిఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశ్యంతోనే తాము తెరాసలో చేరుతున్నామని చెప్పారు. కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వచ్చిందని, వారి నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని తాము భావిస్తున్నామని చెప్పారు. కెసిఆర్ కలలు కన్న తెలంగాణ సాధించేందుకు తాము అండగా నిలబడతామన్నారు.

ఎమ్మెల్సీ సలీం మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు కోసం కెసిఆర్ ఎంతో పోరాటం చేశారన్నారు. ఇప్పటి వరకు దేశంలోనే ముస్లిం వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇవ్వలేదని, ఇప్పుడు కెసిఆర్ ఇచ్చారన్నారు. మైనార్టీలకు కెసిఆర్‌తో న్యాయం జరుగుతుందన్నారు.

MLCs criticise Chandrababu, when joining in TRS

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ... అదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ రైతులకు సబ్సిడీ ఇచ్చి కెసిఆర్, హరీష్ రావులు ఆదుకున్నారని కితాబిచ్చారు. అదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, సిర్పూర్ నియోజకవర్గం అన్నిటి కంటే వెనుకబడి ఉందని దీనిపై దృష్టి సారించాలని కోరారు. వెనుకబడిన తమ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఓ నోడల్ అధికారిని పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్సీ పూల రవిందర్ మాట్లాడుతూ... పద్నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసి కెసిఆర్ తెలంగాణ సాధించారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే కెసిఆర్ వల్లే సాధ్యమన్నారు. కెసిఆర్‌కు పది జిల్లాల తెలంగాణ పైన పూర్తి అవగాహన ఉందన్నారు. కెసిఆర్ వంటి నాయకత్వం దొరకడం మన అదృష్టమన్నారు. కెసిఆర్‌కు అందరం చేదోడువాదోడుగా ఉంటామన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు వందనాలు అన్నారు.

ఎమ్మెల్సీ ఆమోస్ మాట్లాడుతూ... తెలంగాణ సాధించినందుకు మనందరం కృతజ్ఞతతో ఉండాలన్నారు. మనకు ఎంతో శత్రుసైన్యం ఉందని, టిడిపి వంటి కుట్రలను తిప్పికొట్టాల్సి ఉందని, అందుకు కెసిఆర్ సరైన సమాధానం చెబుతున్నారన్నారు. గురుకుల ట్రస్ట్ భూముల పైన చర్యలు తీసుకున్నారన్నారు. తాము కెసిఆర్‌కు అండదండలు అందిస్తామన్నారు.

ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ... 1969లో తెలంగాణ ఉద్యమంలో ఉన్న పలువురు కూడా తెరాసలో చేరుతున్నారన్నారు. కెసిఆర్ తన కుటుంబాన్ని, జీవితాన్ని తెలంగాణ కోసం ధారపోశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీలు ప్రధాన పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కెసిఆర్ కృషి ఎంత ఉందో, సోనియా కృషి అంతే ఉందని, అయితే తాము కాంగ్రెసు పార్టీ పట్ల అసంతృప్తితో తెరాసలో చేరడం లేదని, బంగారు తెలంగాణ కోసం చేరుతున్నామన్నారు. ఎపి సీఎం చంద్రబాబు కయ్యానికి కాలు దువ్వుతున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. అదిలాబాద్ జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు తెరాసతోనే సాధ్యమని, బంగారు తెలంగాణ కెసిఆర్ వల్లే అవుతుందన్నారు. బంగారు తెలంగాణ కోసమే తెరాసలో చేరానని చెప్పారు.

ఈ సందర్భంగా కె కేశవ రావు మాట్లాడుతూ... తెరాసతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని భావించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెరాసలో చేరారన్నారు. కొందరు తెలంగాణపై విషం కక్కుతున్నారని, విష ప్రచారం చేస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ అందరం కలిస్తేనే సాధ్యమని కెసిఆర్ ఎప్పుడు చెబుతున్నారన్నారు. తెరాసలో ఏక వీరుడు ఉన్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+