భలే దొంగలు: చోరీ చేసిన మొబైళ్లు ప్రియురాలికి ఇచ్చి చిక్కారు

జల్సాలకు మరిగిన ముగ్గుుర యువకులు దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. తాము దొంగిలించిన మొబైల్ ఫోన్లను ప్రియురాలికి ఇచ్చి వారు పట్టుబడ్డారు. దారి దోపిడీలకు కూడా పాల్పడ్డారు.

గుంటూరు: జల్సాలకు మరిగిన ముగ్గుుర యువకులు దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. తాము దొంగిలించిన మొబైల్ ఫోన్లను ప్రియురాలికి ఇచ్చి వారు పట్టుబడ్డారు. దారి దోపిడీలకు కూడా పాల్పడ్డారు. ఏటీఎం కార్డులు దోచుకుని చంపేస్తామని బయపెట్టి నెంబర్లు తీసుకుని నగదు దోచేసుకున్నారు.

ఆ నగదుతో జల్సాలు చేస్తూ, ప్రియురాళ్లకు ఖరీదైన బహూమతులు ఇచ్చేవారు.చోరీ చేసిన మొబైల్‌ను కూడా వారు ఆమెకే ఇచ్చారు. అదే మొబైల్ వారిని పోలీసులకు పట్టించింది. ఈ నిందితులు ముగ్గురు 19 సంవత్సరాలలోపు యువకులు కావడం విశేషం.

బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ విజయరావు తెలిపారు.

మొబైల్ కూడా ఎత్తుకెళ్లారు..

మొబైల్ కూడా ఎత్తుకెళ్లారు..

గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంకు చెందిన రాయుడు వెంకట సుబ్బారావు ఈ నెల 14వ తేదీ రాత్రివేళ టూవీలర్‌పై నల్లపాడు రోడ్డులో వెళుతున్న సమయంలో ఫోన్‌ రావడంతో వాహనాన్ని రోడ్డుపై ఆపాడు. ఫోన్‌ మాట్లాడుతున్న సమయంలో ఆయనను ముగ్గురు యువకులు చుట్టుముట్టి బెదిరించారు. నగదు, బంగారు వస్తువులు ఇవ్వాలన్నారు. నగదు లేదని చెప్పడంతో చితకబాది సోదా చేసి జేబులో ఉన్న నాలుగు ఏటీఎం కార్డులు ఎత్తుకెళ్లారు. దానితోపాటు సుబ్బారావు మొబైల్‌ను ఎత్తుకెళ్లారు.

కత్తి పెట్టి బెదిరిస్తూ...

కత్తి పెట్టి బెదిరిస్తూ...

ఈనెల 15వ తేదీ ఈ సంఘటనపై సుబ్బారావు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ముగ్గురు యువకులు దాడి చేసి తన మొబైల్‌ను ఎత్తుకెళ్లడంతో పాటు ఏటీఎం కార్డులు తీసుకువెళ్లారని తెలిపారు. ముగ్గురిలో ఒకరు ఆ కార్డులను తీసుకొని ఏటీఎం కేంద్రానికి వెళ్లగా మిగిలిన ఇద్దరు తనను నల్లపాడురోడ్డు సమీపంలోని ఓ చెట్లపొదల్లోకు తీసుకువెళ్లి మెడపై కత్తిపెట్టి ఏటీఎం కార్డుల పాస్‌వర్డులు చెప్పాలని బెదిరించారని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులకు ఈ విషయం చెప్పవద్దని బెదిరించి పరారైనట్లు తెలిపాడు.

ప్రేయసికి బహుమతిగా...

ప్రేయసికి బహుమతిగా...

ఏటీఎం కార్డుల నుంచి నగదు ఏమైనా తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారించారు. దోపిడి జరిగిన రోజు రాత్రి మూడు విడతలుగా రూ. 24 వేలు, రూ. 25వేలు, రూ. 25 వేలు అలా మొత్తం రూ. 79,500 తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టిన క్రమంలో బాధితుడి నుంచి దొంగిలించిన మొబైల్ నెంబర్‌ ఆధారంగా విచారించారు. నిందితులు వెంటనే మొబైల్‌లోన సిమ్‌ కార్డులను తీసేసి ప్రియురాలికి ఇచ్చారు. మొబైల్ సిమ్‌కార్డులు తొలగించినా ఆ ఫోన్‌కు సంబంధించిన ఈఎంఐ నెంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దండిగా కాల్స్...

దండిగా కాల్స్...

ఓ వ్యక్తికి ఆ ఫోన్‌ నుంచి అధిక సంఖ్యలో కాల్స్‌రావడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆ నెంబర్‌ కలిగిన వ్యక్తికి ఫోన్‌ చేసి మీ మొబైల్‌‌కు బహుమతి వచ్చింది తీసుకువెళ్లాలని ఓ ప్రాంతానికి పిలిచారు. అలా వచ్చిన వ్యక్తిని తనకు వస్తున్న ఫోన్‌ ఎవరిదని విచారిస్తే ఓ మహిళ నుంచి అని తేలింది. ఆ మహిళను పోలీసులు విచారించారు. తనకు ప్రియుడు బహుమానంగా ఇచ్చాడని తెలిపింది. ఆ ప్రేమికుడు నిందితుల్లో ఒక వ్యక్తిగా పోలీసుల విచారణలో తేలింది.

ఆమె ఇచ్చిన సమాచారం మేరకే...

ఆమె ఇచ్చిన సమాచారం మేరకే...

పోలీసులు కొంతమందిని అనుమానించి వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారిలో గుంటూరు శ్రీకృష్ణదేవరాయనగర్‌కు చెందిన ఫైజుల్లా, ఎస్‌కె అన్వర్‌, అంగళకుర్తి పుల్లయ్యలుగా తేలింది. ఈ ముగ్గురు నిందితులను పోలీసులు విచారించారు. నేరం తామే చేశామని అంగీకరించారు. ఈ ముగ్గురు నిందితులపై గతంలోను కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. వృద్ధుడిని బెదిరించి దోపిడీ చేసే సమయంలో ఉపయోగించిన టూవీలర్‌పై నల్లపాడు పరిధిలోనే దొంగిలించి ఆ బైక్‌తో నేరాలు చేస్తున్నట్లు తేలిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+