వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభకు మోపిదేవి: కెసిఆర్‌తో డేట్ ఫిక్స్‌కోసం మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mopidevi comes to Assembly
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, గుంటూరు జిల్లా శాసన సభ్యులు మోపిదేవి వెంకటరమణ జైలు నుండి విడుదలయ్యాక తొలిసారి శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. గురువారం ఆయన సభకు వచ్చారు.

మోత్కుపల్లి, జర్నలిస్టుల మధ్య ఆసక్తికర చర్చ

శాసన సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ లాబీల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు, విలేకరుల మధ్య ఆసక్తిక చర్చ జరిగింది.

తానెప్పుడు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నమస్కారం పెట్టలేదని, ఇప్పుడు మీడియా సాక్షిగా తెలంగాణ రాష్ట్రం కోసం తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దీనికి విలేకరులు స్పందిస్తూ.. ఆ మాటేదో ఆయనతో నేరుగా చెప్పవచ్చు కదా, మీడియా ద్వారా ఎందుకన్నారు.

దానికి స్పందించిన మోత్కుపల్లి తాను కలిసి విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమేనన్నారు. అయితే కెసిఆర్‌ను కలిసేందుకు తేది, వేదికను సిద్ధం చేస్తే కోరుతానన్నారు.

స్పీకర్‌కు టిటిడిపి లేఖ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు లేఖ రాసింది. నెలాఖరులోగా తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగించాలని, కేంద్రానికి పంపించేందుకు కృషి చేయాలని కోరారు.

పార్లమెంటులో, కోర్టులో: గంటా

తాము సమైక్య రాష్ట్రం కోసం పార్లమెంటులో, కోర్టులో పోరాటం చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. అభ్యంతరాలపై తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

English summary
Former Minister Mopidevi Venkataramana on Thursaday came to Assembly for first time after releasing Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X