తల్లీబిడ్డల తలలు నరికి ముడేసి మెడలో వేసుకున్నాడు

పల్లపు చిన్నికి, గుంటూరు జిల్లాకు చెందిన శివయ్యతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంత కాలం క్రితం మృతి చెందడంతో మల్లవల్లి వచ్చి అత్తవారి ఇంటివద్ద వుంది. అనంతరం మల్లవల్లి గ్రామంలోని తల్లి అచ్చి చందమ్మ వద్దకు చేరుకుంది. తల్లి నివాసం వుండే సమీపంలోనే ఒక ఇంటిలో జీవనం కొనసాగిస్తోంది. ఇటీవల ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన అరటికాయల వ్యాపారి పోట్రు శివనాగరాజుతో సన్నిహిత సంబంధాలు ఏర్పాడ్డాయి.
ఈ సంబంధం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీయడంతో అతడు ఎక్కువ సమయం చిన్ని వద్దే ఉంటున్నాడు. దీంతో నాగరాజు తల్లితండ్రులు 10 రోజుల క్రితం మల్లవల్లి గ్రామానికి వచ్చి చిన్నిని, ఆమె తల్లి చందమ్మను హెచ్చరించారు. అప్పటి నుంచి అతడికి చిన్ని ఇంటికి రానీయడం లేదు. బుధవారం రాత్రి నాగరాజు ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. మళ్లీ గురువారం ఉదయం వచ్చిన అతడు ఇంటి అవరణలో వంట చేస్తున్న చిన్నిని అతి కిరాతకంగా పదునైన కత్తితో మెడపై నరికాడు. రక్తపు మడుగులో పడివున్న కూతురి మృతదేహాన్ని చూసి చందమ్మ కేకలు వేయడంతో కత్తితో ఆమె మెడపై బలంగా నరికాడు.
తన తల్లిని, సోదరినీ చంపుతుండడంతో అతడిని అడ్డుకునేందుకు చందమ్మ మూడో కుమార్తె చల్లా శివ ప్రయత్నించింది. ఆమెను సైతం చంపేందుకు శివయ్య వెనుకాడలేదు. కత్తితో ఆమె తలపై బలంగా నరికేందుకు ప్రయత్నించగా తప్పించుకోవడంతో తలకు గాయమైంది. చంద్రమ్మ, చిన్నిల తలలు నరికిన తరువాత వారిద్దరి తలల జుట్టు ముడేసి అక్కడికి కొద్ది దూరంలో పడేశాడు.
స్థానికులకు వైపు కత్తి ప్రదర్శిస్తూ, బెదిరిస్తూ శివయ్య పరారైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నూజివీడు డిఎస్పి కె సూర్యచంద్రరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.












Click it and Unblock the Notifications