విషాదం: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య, కొడుకు ఆత్మహత్య, ఎక్కడ?
తండ్రి మరణించడంతో మానసికంగా కుంగిపోయిన ఆ కుటుంబం అర్ధాంతరంగా తనువుచాలించింది. సివిల్స్ లక్ష్యం చేరకుండానే ఆ కొడుకు తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. ఈ ఘటన కడప జిల్లాలోని కమలాపురంలో చోటుచేసుకొంది.
కమలాపురం: తండ్రి మరణించడంతో మానసికంగా కుంగిపోయిన ఆ కుటుంబం అర్ధాంతరంగా తనువుచాలించింది. సివిల్స్ లక్ష్యం చేరకుండానే ఆ కొడుకు తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. ఈ ఘటన కడప జిల్లాలోని కమలాపురంలో చోటుచేసుకొంది.
గత ఏడాది ఏప్రిల్ పదవతేదిన కమలాపురం పట్టణానికి చెందిన చావలి ప్రసాద్ రెడ్డి అనారోగ్యంతో మరణించాడు. ఆయన మరణాన్ని తట్టుకోలేని ఆయన భార్య గౌరి, కొడుకు ఇంద్రారెడ్డి పురుగుల మందు తాగి సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఎక్కడికైనా వెళ్ళారమోనని స్థానికులు మంగళవారం నాడు వారి గురించి పట్టించుకోలేదు. అయితే బుదవారం సైతం వారి ఇంటి నుండి అలికిడి రాలేదు. దీంతో అనుమానంతో తలుపు తట్టారు. తలుపు తెరిచేసరికి తల్లీ, కొడుకు శవాలుగా పడిఉన్నారు.

స్థానికులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. శవాల వద్ద సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకొన్నారు. మృతదేహల్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వారు అంత్యక్రియలను నిర్వహించారు.
వైవీయూలో పొలిటికల్ సైన్స్ రీసెర్స్ స్కాలర్ గా ఉన్న ఇంద్రారెడ్డి సివిల్స్ మెయిన్స్ కు రెండు దఫాలు ఎంపికయ్యారు.
ఐఎఎస్ సాధించడం తన లక్ష్యమని పలువురితో చెప్పేవాడని స్థానికులు గుర్తుతెచ్చుకొన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇంద్రారెడ్డి అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడడం పట్ల బంధువులు కన్నీరు పెట్టుకొన్నారు.












Click it and Unblock the Notifications