కెసిఆర్‌పై మోత్కుపల్లి సై, జగన్ సంతకాలపై యనమల

Mothkupalli ready to contest against KCR
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తాను పోటీ చేసేందుకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి కెసిఆర్ పోటీ చేస్తే ఆయన ప్రత్యర్థిగా తాను అక్కడ నుంచే బరిలోకి దిగుతానన్నారు.

అక్రమాలకు కెసిఆర్ చిరునామా అని ఆయన అక్రమాలన్నింటినీ తాను బయటపెడతానని హెచ్చరించారు. మల్కాజిగిరి నుండి కెసిఆర్ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయని.. అది నిజమా లేక లీకులా అన్నారు.

జగన్ పైన యనమల, పయ్యావుల

తాను అధికారంలోకి వస్తే ఐదు సంతకాలు చేస్తానన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి నేత యనమల రామకృష్ణుడు సెటైర్లు వేశారు. గన్ ఇప్పటికే రెండు పత్రాల పైన సంతకాలు చేశారని ఎద్దేవా చేశారు. ఒకటి రాష్ట్ర విభజన బిల్లు పైన, రెండు బెయిల్ ఒప్పందం పత్రాల పైన అని ధ్వజమెత్తారు. జగన్ జనాలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన అదికారంలోకి వస్తే ఐదు సంతకాలతో తలరాతను మార్చేస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. జగన్ అధికారంలోకి వస్తే పెట్టే సంతకాలన్నీ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవడానికేనని విమర్శించారు.

జగన్‌కు ఓటేయడమంటే కాంగ్రెసు పార్టీకి ఓటు వేసినట్లేనని పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలని కోరారు. రాష్ట్రాన్ని విడదీసిన సోనియా గాంధీకి గుణపాఠం చెప్పేలా ఓటు వేయాలన్నారు.రాష్ట్రాన్ని అప్పుల నుంచి ఆస్తుల వైపు నడిపిన ఘనత చంద్రబాబుదే అన్నారు.

కొత్త రాష్ట్రంలో సవాళ్లు ఉన్నాయని తమకు తెలుసని, ఆ సవాళ్లు ఎదుర్కోనే సత్తా చంద్రబాబుకే ఉందని తెలిపారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని దిగ్విజయంగా నడిపిన ఘనత చంద్రబాబుదన్నారు. జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉందని, గెలిచినా కోర్టుల చుట్టూ తిరుగుతాడని ఆరోపించారు. అప్పుడు మనం బ్యాంకుల చుట్టు తిరగాలన్నారు. అందుకే టిడిపిని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత అందరిదీ అన్నారు.

వైయస్ అరాచకాలపై పోరాడుతా: సతీష్

జిల్లాలో వైయస్ కుటుంబ సభ్యుల అరాచాకాలపై కడవరకు పోరాటం చేస్తామని టిడిపి ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు టిడిపిలో చేరారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా టిడిపి అధ్యక్షుడు లింగారెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

సహకారం అవసరం: వీరభద్రం

విభజన వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి తెలంగాణ, సీమాంధ్ర మధ్య పరస్పర సహకారం అవసరమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం ఉదయం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఏర్పాటు చేసిన మీట్‌ది ప్రెస్‌లో వీరభద్రం పాల్గొన్నారు. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రజల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత పార్టీలపై ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆర్థికంగా నిలబడాలంటే ఉదారవాద విధానాలకు స్వస్తి పలకాలని తమ్మినేని వీరభద్రం సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+